IPPB Alert: ఖాతాదారులకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (India Post Payments Bank) షాకిచ్చిది. ఖాతాల్లో డబ్బు జమ చేసిన, విత్ డ్రా చేసిన ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం బ్యాంకింగ్ రూల్స్‌లో మార్పులు (India Post Payments Bank new Rules) చేసింది. సవరించిన ఈ నిబంధనలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచే అమలులోకి రానున్నాయి.
కొత్త రూల్స్ ఇలా..
ప్రస్తుతం ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) మూడు రకాల అకౌంట్లను ఇస్తోంది. అవి 1.బేసిక్ సేవింగ్స్ ఖాతా. 2.సేవింగ్స్ ఖాతా. 3.కరెంట్ ఖాతా.
ఈ మూడు ఖాతాల్లో ప్రయోజనాలు, నగదు డిపాజిట్, విత్‌డ్రా పరిమితులు వేర్వేరుగా ఉంటాయి.
ఖాతాను బట్టి ఐపీపీబీ విధించిన పరిమితి కన్న ఎక్కువ డిపాజిట్ చేసినా, విత్‌డ్రా చేసిన ఛార్జీలు వర్తిస్తాయి.
ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. పేమెంట్ బ్యాంక్ అకౌంట్లో (Payments Bank account) రూ.లక్ష కన్నా ఎక్కువగా ఖాతాలో ఉండకూడదు. అయితే పోస్టాఫీస్ పేమెంట్ బ్యాంక్ ఖాతాలో మాత్రం రూ.లక్ష కన్నా అధిక మొత్తంతో ఖాతా తెరిచే వీలుంది.
బేసిక్ సేవింగ్స్ ఖాతాలో ఇలా..
ఐపీపీబీ అందించే బేసిక్ సేవింగ్స్ ఖాతాలో క్యాష్ డిపాజిట్‌పై పరిమితులు లేవు. ఎంత మొత్తం జమ చేసిన ఉచితమే. విత్‌డ్రా చేసుకుంటే నెలకు 4 లావాదేవీలు మాత్రం ఉచితం. ఆపై జరిపే విత్‌డ్రా లావాదేవీలకు కనీసం రూ.25 ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. భారీ మొత్తంలో విత్ డ్రా చేస్తే.. ఆ విలువలో 0.50 శాతం ఛార్జీగా వసూలు చేయనుంది.
సేవింగ్స్ అకౌంట్, కరంట్ అకౌంట్లో ఇలా..
సేవింగ్స్ ఖాతా, కరెంట్ అకౌంట్లో నెలకు రూ.10 వేల వరకు చేసే డిపాజిట్లు ఉచితం. అంతకు మించి చేసే డిపాజిట్ లావాదేవీలపై కనీసం రూ.25 ఛార్జీ వసూలు చేయనుంది ఐపీపీబీ. లేదా డిపాజిట్ విలువలో 0.50 శాతం ఛార్జీగా వసూలు చేస్తుంది ఐపీపీబీ.
సేవింగ్స్ ఖాతా (సాధారణ ఖాతా కాకుండా)లో నెలకు రూ.25 వేల వరకు విత్‌డ్రా ఉచితం. ఈ పరిమితి దాటిన తర్వాత చేసే విత్‌డ్రాకు రూ.25 ఛార్జీ వసూలు చేయనున్నట్లు పోస్టల్ పేమెంట్ బ్యాంక్ వివరించింది.
Also read: Fine on Amazon: అమెజాన్ ఇండియా సీసీఐ షాక్- రూ.200 కోట్లు ఫైన్
Also read: PF balance transfer: పాత పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్‌ను కొత్త ఖాతాలోకి బదిలీ చేసుకోవడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook