Omicron Variant: ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ దేశంలో ప్రవేశించేసింది. పొరుగు రాష్ట్రాల్లో సైతం ఒమిక్రాన్ కేసులు వెలుగు చూడటంతో ఏపీ ప్రభుత్వం అప్రత్తమైంది. పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకుంటోంది.
కోవిడ్ 19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్(Omicron Variant)ప్రపంచాన్ని సవాలు విసురుతోంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వేరియంట్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా దేశాలకు విస్తరించింది. బెంగళూరులో 2 కేసులతో ఇండియాలో వెలుగుచూసిన ఈ వేరియంట్..అప్పుడే 3-4 రాష్ట్రాల్లో విస్తరించింది. 2 కేసుల్నించి 25 కేసులకు చేరింది. ఇంకా చాలావరకూ వివరాలు తెలియాల్సి ఉంది. పొరుగు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూడటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. విదేశీ ప్రయాణీకుల విషయంలో పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకుంటోంది. విదేశాల్నించి వచ్చే ప్రయాణీకులకు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తోంది.
విమానాశ్రయాల్లో అప్రమత్తంగా ఉంటూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఏపీలోని విజయవాడ విమానాశ్రయానికి వచ్చే ప్రయాణీకుల్ని పరీక్షించాలని ఆదేశాలిచ్చింది. విదేశాల్నించి వచ్చే ప్రతి ప్రయాణీకుడికి తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు(RTPCR Tests) చేస్తున్నారు. విజయవాడ విమానాశ్రయం మీదుగా వారంలో మూడ్రోజులపాటు మస్కట్ బహ్రెయిన్, కువైట్‌కు ప్రయాణీకులు వెళ్తుంటారు. ఆర్టీపీసీఆర్ పరీక్షల అనంతరం వారం రోజులపాటు హోమ్ ఐసోలేషన్‌లో(Isolation) ఉండాలనే సూచనలు జారీ చేస్తున్నారు. సంబంధిత వ్యక్తి వివరాలు సమీపంలోని ఆరోగ్య కార్యకర్తకు అందించి..వారం రోజులు అతని ఆరోగ్యంపై నిఘా ఉంచేలా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. నిషేధమున్న దేశాల్నించి విజయవాడకు నేరుగా ప్రయాణీకులు వచ్చే అవకాశం లేదు. కువైట్ నుంచి వచ్చిన 237 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో కొత్తగా 157 కరోనా కేసులు వెలుగు చూశాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 30 వేల 979 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు.
Also read: Vizag beach: విశాఖ ఆర్కే బీచ్‌లో ముందుకొచ్చిన సముద్రం...పర్యాటకులకు నో ఎంట్రీ...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook