Mumbai Indians: ముంబై ఇండియన్స్ నుంచి ఎవరు ఇన్ , ఎవరు అవుట్, ఇదే జాబితా

Mumbai Indians Retained Players list: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 మెగా ఆక్షన్ కోసం ఆటగాళ్ల రిటైన్డ్ జాబితా విడుదలైంది. కొన్ని జట్లు ఊహించని విధంగా కొంతమంది ఆటగాళ్లను వదులుకున్నాయి. ముంబై ఇండియన్ జట్టు ఎవరిని వదులుకుంది, ఎవరిని రిటైన్ చేసుకుందో పరిశీలిద్దాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 1, 2021, 06:59 AM IST
  • ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్ కోసం రిటైన్డ్ ప్లేయర్స్ జాబితా విడుదల చేసిన ఫ్రాంచైజీలు
  • హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్‌లను వదులుకున్న ముంబై ఇండియన్స్
  • రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, బూమ్రా, కీరన్ పొలార్డ్‌లు రిటెన్షన్ జాబితాలో
 Mumbai Indians: ముంబై ఇండియన్స్ నుంచి ఎవరు ఇన్ , ఎవరు అవుట్, ఇదే జాబితా

Mumbai Indians Retained Players list: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 మెగా ఆక్షన్ కోసం ఆటగాళ్ల రిటైన్డ్ జాబితా విడుదలైంది. కొన్ని జట్లు ఊహించని విధంగా కొంతమంది ఆటగాళ్లను వదులుకున్నాయి. ముంబై ఇండియన్ జట్టు ఎవరిని వదులుకుంది, ఎవరిని రిటైన్ చేసుకుందో పరిశీలిద్దాం.

ఐపీఎల్ మెగా ఆక్షన్ 2022(IPL Mega Auction 2022) జనవరిలో జరగనుంది. ఈ నేపధ్యంలో వివిధ ఫ్రాంచైజీ జట్లు ఏయే ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటున్నాయో, ఎవరిని వదులుకుంటున్నాయనే జాబితా విడుదల చేయాలి. ఇవాళ అంటే డిసెంబర్ 1వ తేదీన అధికారికంగా బీసీసీఐ ఆ జాబితాలను విడుదల చేయనుంది. కొన్ని జట్లు ఊహించని రీతిలో కొందరిని రిటైన్ చేసుకోవడం లేదా వదులుకోవడం గమనార్హం. ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్ రిటైన్డ్ ప్లేయర్స్ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం..

ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్ కంటే ముందు ముంబై ఇండియన్స్(Mumbai Indians Retained Players List) నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఇందులో కెప్టెన్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బూమ్రా, కీరన్ పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్‌లు ఉన్నారు. అదే సమయంలో కీలకమైన స్టార్ ఆటగాళ్లుగా భావిస్తున్న హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్‌లను వదులుకుంది. వాస్తవానికి ముంబై ఇండియన్స్ విజయానికి ఈ ఇద్దరూ చాలా కీలకం. అయితే కొత్త టీమ్‌లో యాజమాన్యం ఈ ఇద్దరినీ వదులుకోవడం ఆశ్చర్యం కల్గిస్తోంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ కొనసాగనుండగా, జస్ప్రీత్ బూమ్రా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశాలున్నాయి. 

బీసీసీఐ (BCCI) రిటెన్షన్  నిబంధనల ప్రకారం 8 ఫ్రాంచైజీలు గరిష్టంగా నలుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు. ఇద్దరు భారత ఆటగాళ్లు, విదేశీ ఆటగాళ్లను ఎంచుకోవచ్చు. లేదా ముగ్గురు భారత ఆటగాళ్లు, ఒక విదేశీ ఆటగాడిని రిటైన్ చేసుకునే వీలుంది.  అదే సమయంలో అన్ క్యాప్‌డ్ ప్లేయర్స్ మాత్రం ఇద్దరు మించకూడదు. ఒక టీమ్ నలుగురిని రిటైన్ చేసుకుంటే.. తొలి ఆటగాడికి 16 కోట్లు, రెండవ ప్లేయర్‌‌కు 12 కోట్లు, మూడవ ఆటగాడికి 8 కోట్లు, నాలుగవ ప్లేయర్‌కు 6 కోట్లు చెల్లించాలి. దాంతో ప్రతి ఫ్రాంచైజీ మొత్తం 90 కోట్ల నుంచి 42 కోట్లు కోల్పేతే..మిగిలిన 48 కోట్ల నుంచే ఇతర ఆటగాళ్లు ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది. ఈ నిబంధనల్ని పరిగణలో తీసుకుని ముంబై ఇండియన్స్ జట్టు కొంతమంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడం లేదా వదులుకోవడం చేసింది.

ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతున్న రోహిత్ శర్మకు(Rohit Sharma)16 కోట్ల చెల్లిస్తూ రిటైన్ చేసుకుంది. ఇక టీమ్ ఇండియా(Team India)పేస్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రాను వదులుకునేందుకు సాహసించలేదు. అందుకే 12 కోట్లు చెల్లించి రిటైన్ చేసుకుంది. టీమ్‌లో కీలకమైన ఆటగాడిగా చెలరేగుతున్న సూర్యకుమార్ యాదవ్‌కు 8 కోట్లతో కొనసాగిస్తోంది. వెస్టిండీస్‌కు చెందిన కీరన్ పొలార్డ్‌కు ముంబై ఇండియన్స్ 6 కోట్లతో రిటైన్ చేసుకుంది.

ఇక హార్దిక్ పాండ్యా(Hardik Pandya), ఇషాన్ కిషన్‌లతో పాటు అన్మోల్ ప్రీత్‌సింగ్, క్రిస్‌లీన్, సౌరభ్ తివారీ, పీయూష్ చావ్లా, మొహ్సిన్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, క్వింటన్ డికాక్, అర్జున్ టెండూల్కర్, రాహుల్ ‌హార్ లను ముంబై ఇండియన్స్ జట్టు వదులుకుంది. 

Also read: ఐపీఎల్ 2022 రిటైన్డ్ ప్లేయర్స్ జాబితా విడుదల, సీఎస్కే లో ఎవరు ఇన్, ఎవరు అవుట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News