Diwali Celebrations: దీపావళి సంబరాలపై న్యాయస్థానం సంచలన ఆదేశాలు జారీ చేసింది. పండుగ జరుపుకునేందుకు కేవలం రెండు గంటల వ్యవధి మాత్రమే ఇచ్చింది. ఫలితంగా కేవలం 2 గంటలే దీపావళి టపాసులు పేల్చుకునేందుకు అనుమతి లభించింది.
దేశం యావత్తూ దీపావళికి(Diwali) సిద్ధమవుతోంది. ఈ తరుణంలో న్యాయస్థానం నుంచి కీలక ఆదేశాలు విడుదలయ్యాయి. కేవలం రెండు గంటలు మాత్రమే దీపావళి జరుపుకోవాలని భువనేశ్వర్ హైకోర్టు సూచించింది. ఫలితంగా రాత్రి 8 నుంచి 10 గంటల వరకే టపాసులు పేల్చేందుకు అనుమతి ఇవ్వనున్నారు. కరోనా విజృంభణకు తావులేకుండా వేడుకల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టాలని గతంలో సుప్రీంకోర్టు సూచించింది. మరోవైపు బేరియమ్ సాల్ట్స్‌తో తయారైన బాణసంచా వినియోగాన్ని నిషేధించాలని సుప్రీంకోర్టు(Supreme Court)అక్టోబరు 29వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పండగ నిర్వహణపై సోమవారం తుది తీర్పు వెల్లడించింది హైకోర్టు. కోవిడ్19 వ్యాప్తి కట్టడి దృష్ట్యా సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్ జారీచేసిన మార్గదర్శకాల పరిధిలో రాష్ట్రంలో బాణాసంచా క్రయ విక్రయాలు, వినియోగానికి సంబంధించి నిర్దిష్టమైన మార్గదర్శకాలను దాఖలు చేయాలని రాష్ట్ర ప్రత్యేక సహాయ కమిషనర్ ఎస్ఆర్సీని కోరింది.
దీనికోసం రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు, కటక్-భువనేశ్వర్ జంట నగరాల పోలీస్ కమిషనరేట్‌తో సంప్రదింపులు జరపాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదికి హైకోర్టు(High Court)ఆదేశించింది. బాణాసంచా క్రయ విక్రయాల అనుమతి అభ్యర్థనతో అఖిల ఒడిశా ఫైర్వర్క్స్ డీలర్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ పురస్కరించుకుని, ఈ మేరకు ఉత్తర్వులు జారీ కావడం గమనార్హం. ఇదిలా ఉండగా, పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఆమోదించిన హరిత బాణసంచా క్రయవిక్రయాలు, వినియోగానికి ధర్మాసనం అనుమతించడం విశేషం.
Also read: ONGC: చమురు, ఆయిల్ కంపెనీలు ప్రైవేట్‌పరం కానున్నాయా, ఓఎన్జీసీ ప్రైవేటీకరణకు ప్రయత్నాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook