Huzurabad bypoll updates: హైదరాబాద్ : హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కి బీసీ సంఘాల మద్దతు విషయంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తన వైఖరిని స్పష్టంచేశారు. గెల్లు శ్రీనివాస్‌ని (Gellu Srinivas) గెలిపించాల్సిందిగా బీసీ సంఘాలు, ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఆర్ కృష్ణయ్య.. టీఆర్‌ఎస్ పార్టీకి తాము మద్దతు పలుకుతున్నందుకు ఎన్నో కారణాలు చెప్పగలమని అన్నారు. అదే సమయంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ని (Etela Rajender) గెలిపించేందుకు మీరు ఏమైనా కారణాలు చెప్పగలరా అని బీజేపీ నేతలతో పాటు గెల్లు శ్రీనివాస్‌కు మద్దతు విషయంలో తమను వ్యతిరేకించే వారిని ఆయన ప్రశ్నించారు.
హుజూరాబాద్‌లో ఉప ఎన్నికకు తేదీ సమీపించిన నేపథ్యంలో గురువారం మీడియాతో మాట్లాడిన ఆర్ కృష్ణయ్య.. దళిత బంధు పథకం తరహాలోనే బీసీ బంధు పథకం కూడా ప్రవేశపెట్టి అర్హులైన ప్రతీ కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని తాము రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేశామని, అదే రోజు సీఎం కేసీఆర్ వెంటనే సమావేశం ఏర్పాటు చేసి బీసీబంధు పథకం అమలుపై సానుకూలత వ్యక్తం చేశారని గుర్తుచేశారు. వచ్చే ఏడాది నుంచి బీసీ బంధు పథకం అమలు చేస్తామని సీఎం కేసీఆర్ (CM KCR about BC Bandhu scheme) హామీ ఇచ్చారని ఆర్ కృష్ణయ్య తెలిపారు.
Also read : Dalit bandhu: దళిత బంధుపై దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు
బీసీ బంధు పథకమే (BC bandhu scheme) కాకుండా బీసీల అభ్యున్నతి, సంక్షేమం కోసం టీఆర్‌ఎస్ సర్కారు ఇప్పటివరకు అనేక చర్యలు తీసుకుందని, అందుకే హుజూరాబాద్ ఉప ఎన్నికలో (Huzurabad bypolls latest updates) టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు తమ మద్దతు ప్రకటిస్తున్నామని తేల్చిచెప్పారు.
జనగణనలో బీసీలను లెక్కించడానికే ముందుకురాని బీజేపీ, దేశంలోని 70 కోట్ల మంది బీసీలను ఎలా అభివృద్ధి చేస్తుందని ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు. ఇకనైనా బీసీలపట్ల బీజేపీ తమ వైఖరి మార్చుకుంటే బాగుంటుందని ఆయన హితవు పలికారు.
Also read : Breaking: తెలంగాణలో ఉద్భవించనున్న మరో కొత్త పొలిటికల్ పార్టీ
Also read : KTR toured Station F: ఫ్రాన్స్‌లో కొనసాగుతోన్న కేటీఆర్ పర్యటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook