Facts Of Pet Dogs: పెంపుడు జంతువులుగా ఎక్కువగా కుక్కల్నే మనం చూస్తుంటాం. ముఖ్యంగా ఇండియాలో. కేవలం పెంచడమే కాకుండా ప్రాణపదంగా చూసుకుంటారు కూడా. పెంపుడు కుక్కల సౌఖ్యం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే మీ పెంపుడు కుక్కలకు సంబంధించి చాలా విషయాలు తక్కువ మందికే తెలుసంటే ఆశ్చర్యం లేదు. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
వాసన పసిగట్టే లక్షణం కుక్కలకు మనిషి కంటే వేలాది రెట్లు ఎక్కువ. ఏదైనా పరిశోధనలో కుక్కలపై ఎక్కువ భరోసా పెట్టుకోవచ్చు. ఆ లక్షణం కారణంగానే అంతరిక్షంలో ముందుగా కుక్కనే పంపించారు. దాదాపు 150 పదాల వరకూ కుక్క నేర్చుకుంటుందని చెబుతారు.
కాస్త అలికిడైనా సరే అప్రమత్తమయ్యే కుక్కల్ని చూసి..ఎక్కువగా నిద్రపోవని అనుకుంటాం సాధారణంగా. కానీ అది కానే కాదు. లైవ్‌సైన్స్ వెబ్‌సైట్ రిపోర్ట్ ప్రకారం కుక్కలు మనిషి కంటే ఎక్కువగా పడుకుంటాయి. ఈ విషయంపై రీసెర్చ్ కూడా జరిగింది.
మనిషిలానే కుక్కలు కూడా కలలు కంటుంటాయి. చాలాసార్లు కుక్కలు నిద్రలో కాళ్లు ఊపుతూ కన్పిస్తుంటాయి కదా. వాస్తవానికి అవి నిద్రలో కలలు కనే సమయంలోనే అలా చేస్తుంటాయి.
కేవలం మనిషికే కాదు కుక్కల్లో కూడా ఓ లక్షణం ఉంటుంది. ఎదుటి వ్యక్తి కళ్లలో చూసి అతడి హావభావాల్ని లేదా మూడ్‌ను పసిగట్టడం. ఈ లక్షణం కుక్కల్లో ఉంటుంది. అందుకే కుక్కలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా వాటితో కొన్ని రకాల పనులు చేయించుకుంటుంటారు. అవతలి వ్యక్తి కోపంగా ఉన్నాడా లేదా ప్రశాంతంగా ఉన్నాడా అనేది కుక్కలు కళ్లు చూసి పసిగట్టేస్తాయిట.
సాధారణంగా పెంపుడు కుక్కల ప్రత్యేకతలంటే ముందుగా విశ్వాసమనే విన్పిస్తుంది. కుక్కల్ని మించిన విశ్వాసపు జంతువులు లేనేలేవు. కానీ కేవలం విశ్వాసమే కాకుండా ఇంకా చాలా ప్రత్యేకతలున్నాయి. విశ్వాసపు జంతువనే కోణంలో అనాదిగా కుక్కల్ని పెంచుతూ వస్తున్నారు.