Sameera Reddy COVID-19 Positive: నటిగా సినిమాలకు చేస్తున్న సమయంలో అందానికి చాలా ప్రాధాన్యం ఇవ్వాల్సి వచ్చేదని, ప్రస్తుతం ఆరోగ్యం విషయం మాత్రమే తాను ఆలోచిస్తున్నానని ఇటీవల పోస్ట్ చేసింది టాలీవుడ్ నటి సమీరా రెడ్డి. బాలీవుడ్‌లోనూ పలు సినిమాలు చేసిన సమీరా రెడ్డి గత కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. తనకు కరోనా సోకినట్లు తెలిపి తన అభిమానులకు సమీరా రెడ్డి షాకిచ్చింది.
ఇటీవల తనకు కరోనా లక్షణాలు రావడంతో సమీరా రెడ్డి కోవిడ్19 నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. రెండు రోజుల కిందట రిపోర్టులు రాగా, తనకు కరోనా పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించినట్లు సమీరా రెడ్డి తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు చేసింది. తన ఆరోగ్యం గురించి ఏ ఆందోళన చెందాల్సిన పనిలేదని, పలు విషయాలు తన పోస్టులో రాసుకొచ్చింది. ‘కరోనా(COVID-19) పాజిటివ్ అని నిన్న నిర్ధారణ అయింది. ప్రస్తుతం అందరం ఆరోగ్యంగానే ఉన్నాం. అత్తామామలు వేరే చోటు ఉంటున్నారు. దేవుడి దయ వల్ల వారికి కరోనా లాంటివి సోకలేదు. కష్టకాలంలోనే మనం స్ట్రాంగ్‌గా ఉండాలి. ముఖంపై చిరునవ్వు అలాగే ఉండాలి. అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ’ నటి సమీరా రెడ్డి తన పోస్టులో పేర్కొంది.
Also Read: IPL 2021 Funny Memes: జానీ బెయిర్‌స్టో హిట్ వికెట్‌పై పేలుతున్న జోక్స్, Viral అవుతున్న ఫన్నీ మీమ్స్
సమీరా రెడ్డి టాలీవుడ్లో జూనియర్ ఎన్టీఆర్ సరసన చేసిన నరసింహుడు, అశోక్ మూవీలతో గుర్తింపు తెచ్చుకుంది. Tollywood మెగాస్టార్ చిరంజీవి సరసన జై చిరంజీవ సినిమాలో నటించింది. ఆమె 2002లో సోహైల్ ఖాన్ సరసన మైనే దిల్ తుజే దియా మూవీలో నటించి బాలీవుడ్లో కాలుపెట్టింది. ధర్నా మనా హే, ముసఫిర్, టాక్సీ నెంబ 9211, రేస్, టీజ్ వంటి పలు సినిమాలలో నటించింది. 2014లో అక్షయ్ వార్దేను వివాహం చేసుకుని వైవాహిక జీవితానికి సమయాన్ని కేటాయిస్తోంది. వీరికి సంతానం సాన్స్, నైరా ఉన్నారు.
Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook