Whatsapp Launches A New Feature | ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సప్ నూతన ప్రైవసీ పాలసీపై పలు దేశాల్లో విమర్శలు వెల్లువెత్తడంతో కొంత వెనుకడుగు వేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సైతం వాట్సాప్ సంస్థకు కీలక నోటీసులు ఇవ్వడం తెలిసిందే. మరోవైపు తన యాప్ అన్ ఇన్స్టాల్స్, వాట్సాప్ అకౌంట్లు డిలీట్ కానుండటంతో ఆందోళన మొదలైంది.
Whatsapp Launches A New Feature | ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సప్ నూతన ప్రైవసీ పాలసీపై పలు దేశాల్లో విమర్శలు వెల్లువెత్తడంతో కొంత వెనుకడుగు వేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సైతం వాట్సాప్(WhatsApp Latest Update) సంస్థకు కీలక నోటీసులు ఇవ్వడం తెలిసిందే. మరోవైపు తన యాప్ అన్ ఇన్స్టాల్స్, వాట్సాప్ అకౌంట్లు డిలీట్ కానుండటంతో ఆందోళన మొదలైంది. Also Read: Hike Messaging APP Shuts Down: హైక్ మెసేజింగ్ యాప్ సేవలు బంద్.. హైక్ మెసేంజర్ చరిత్ర ఇది..
వాట్సాప్ త్వరలో తీసుకురానున్న ప్రైవసీ పాలసీపై వినియోగదారులకు తలెత్తుతున్న సందేహాలను తొలగించే యత్నం చేస్తూనే మరోవైపు కొత్త అప్డేట్స్, నూతన ఫీచర్లు తీసుకురావడంతో మాత్రం ముందుకు సాగుతోంది. వాట్సాప్ గ్రూప్ చాట్‌లో మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది వాట్సాప్.
ఇప్పటివరకూ వాట్సాప్ గ్రూప్ చాట్స్లలో ఉండే మ్యూట్ ఆప్షన్(Mute Option In WhatsApp)కు మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. గతంలో మ్యూట్ ఆప్షన్ కేవలం 8 గంటల నుంచి గరిష్టంగా సంవత్సరం వరకు ఎంచుకునే ఆప్షన్ ఉండేది. తాజాగా గ్రూప్ చాట్ మ్యూట్ ఆప్షన్‌ను జీవితాంతం సెట్ చేసుకునే ఫీచర్‌ను తన వినియోగదారుల కోసం వాట్సాప్ తీసుకొచ్చింది. Also Read: How To Secure Whatsapp Chat: ఈ టిప్స్ పాటిస్తే మీ వాట్సాప్ డేటా సేఫ్
ఈ ఫీచర్ తీసుకొచ్చినట్లు ట్విట్టర్(Twitter) ద్వారా వాట్సాప్ ప్రకటించింది. ఇకనుంచి ఏడాది టైమ్‌ను ఎల్లప్పుడుగా మార్చుకోవచ్చు అంటూ అప్డేట్ ఇచ్చింది వాట్సాప్. ఈ ఫీచర్ యాక్టివ్ చేసుకునే విధానం ఇది... మొదటు మీకు కోరుకున్న వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేయాలి. కుడివైపు ఉన్న మూడు డాట్స్ మీద క్లిక్ చేసి, మ్యూట్ నోటిఫికేషన్స్ సెలక్ట్ చేయాలి. అందులో ఎల్లప్పుడూ(Always) అనే ఆప్షన్‌ను క్లిక్ చేస్తే సరి. Also Read: WhatsApp Delays New Privacy Policy: ప్రైవసీ పాలసీపై వెనక్కి తగ్గిన వాట్సాప్
వాట్సాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ లేటెస్ట్ వెర్షన్లలో ఈ ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. మీకు ఇబ్బందిగా అనిపించిన వాట్సాప్ చాట్ గ్రూప్‌ను ఇలా మ్యూట్ చేసుకోవచ్చు. మరిన్ని ఫీచర్లను వాట్సాప్ అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉంది.