Fact Check: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( Reserve Bank of India )..పాత నోట్లను మరోసారి రద్దు చేయనుందంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చింది. వంద రూపాయు, పది, ఐదు రూపాయల పాత నోట్లను ఆర్బీఐ రద్దు చేయనుందా.
డీ మోనిటైజేషన్ ( Demonetisation )ను దేశ ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు. ఇప్పుడు మరోసారి అటువంటి వార్తలు వస్తుండటంతో ఆందోళనకు గురవుతున్నారు జనం. ఆర్బీఐ..వంద, పది, ఐదు రూపాయల పాతనోట్లను ( Old Notes ) రద్దు చేస్తుందంటూ గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్నాయి. దేశ ప్రజల్లో ఈ విషయమై ఆందోళన నెలకొనడంతో ఆర్బీఐ స్పందించింది. ట్విట్టర్ వేదికగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. వంద, పది, ఐదు రూపాయల పాతనోట్లను చలామణీలోంచి తీసివేస్తున్నట్టు వస్తున్న వార్తల్ని ఖండించింది. ఆ వార్తలన్నీ తప్పుడు వార్తలుగా స్పష్టం చేసింది. 2021 మార్చ్ నెలలోగా పాత నోట్లను రద్దు చేస్తున్నట్టుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ విషయంపై ట్విట్టర్ ద్వారా స్పష్టత ఇచ్చింది. ఇదంతా ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది ఆర్బీఐ ( RBI ). అటువంటి ఏ నిర్ణయాలు తీసుకోలేదని స్పష్టం చేసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.
Also read: RBI Big Decision: పెన్షనర్లకు చేసిన అదనపు పెన్షన్ రికవరీపై RBI కీలక నిర్ణయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook