Who Will Not Receive The Corona Vaccine | వ్యక్తిగతంగా ఆయా లబ్దిదారులకు గతంలో ఏదైనా టీకాగానీ, ఇంజక్షన్ గానీ ఇచ్చినప్పుడు ఎలర్జీ మరియు ఏవైనా ప్రతికూల పరిస్థితులు ఏర్పడినట్లయితే అలాంటి వారు టీకాను వేయించుకోరాదు.
COVID-19 Vaccine: Who Will Not Receive The Corona Vaccine | వ్యక్తిగతంగా ఆయా లబ్దిదారులకు గతంలో ఏదైనా టీకాగానీ, ఇంజక్షన్ గానీ ఇచ్చినప్పుడు ఎలర్జీ మరియు ఏవైనా ప్రతికూల పరిస్థితులు ఏర్పడినట్లయితే అలాంటి వారు టీకాను వేయించుకోరాదు.
గర్భవతులు, పాలిచ్చే తల్లులు సైతం కరోనా టీకాలు వేయించుకోవద్దని మార్గదర్శకాలు జారీ అయ్యాయి.
కరోనా లక్షణాలు ఉన్నవారు కనీసం 4 నుండి 8 వారాల వ్యవధి తర్వాత మాత్రమే వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. Also Read: COVID-19 Vaccine తీసుకున్నవారిలో ఏ లక్షణాలు కనిపిస్తాయంటే..
కరోనా సోకిన సమయంలో ఎవరైతే చికిత్సలో భాగంగా ప్లాస్మా థెరపీ తీసుకుని ఉంటే.. అలాంటి వారు కనీసం 4 నుంచి 8 వారాల తరువాత కోవిడ్-19 టీకాలు వేయించుకోవాలి.
ప్రస్తుతం ఏదైనా ఇతరత్రా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన వారు డిశ్ఛార్జి అయిన 4 వారాల నుంచి 8 వారాల తరువాత మాత్రమే కరోనా టీకాలు వేయించుకోవాలని అధికారులు సూచించారు.
ఎవరైనా రక్తము పల్చగా అయ్యేందుకు మెడిసిన్ యాంటీ కో యాగ్యులెట్స్ వాడుతున్నారో.. అలాంటి వ్యక్తులు కేవలం వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే కరోనా టీకా తీసుకోవాల్సి ఉంటుంది. Also Read: COVID-19 vaccine తీసుకుంటే ఇక పిల్లలు పుట్టరా ?
ఈ విషయాలన్నింటిని ప్రతీ ఓక్కరూ గుర్తించుకోవాలి..
అంతేకాకుండా ముందుగా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.