చలికాలం (Winter Season) ఎన్నో రకాల వ్యాధులు వస్తుంటాయి. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యంపై (Health) ధ్యాస పెట్టలేదంటే..చిన్న సమస్యలు పెద్ద ఇబ్బందులుగా మారుతాయి. వెల్లుల్లి వేపుడుతో (Roasted Garlic) మకలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వెల్లుల్లి వేపుడు వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాల్లో జలుబు, దగ్గు నుంచి ఊరట లభించడం ఒకటి.
వెల్లుల్లిలో ఉండే ఎలిసిన్ గుండె పదికాలల పాటు ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఇది నిర్మూలిస్తుంది.
వెల్లుల్లి తరచుగా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నిత్యం తేనెతో పాటు వేయించిన వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది.
చలికాలం వచ్చిందంటే రకరకాల ఆహార పదార్ధాల రుచి చూడటం అనేది సాధారణం. దీంతో బరువు పెరుగుతుంది. వేయించిన వెల్లుల్లి తినడం వల్లత బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.
శ్వాస సంబంధిత సమస్యలు ఉన్న వారికి.. ముఖ్యంగా ఆస్తమా ఉన్నవారికి వెల్లుల్లి వేపుడు వల్ల ప్రయోజనం కలుగుతుంది.