AP Deepavali Celbrations | కరోనా వ్యాప్తి సమయంలో దీపావళి టపాసులు, సంబరాలపై ఇప్పటికే పలు రాష్ట్రాలు నిషేధం విధించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రభుత్వం దీపావళి టపాసులపై కీలక నిర్ణయం తీసుకుంది. టపాసులు రోజులో ఇష్టం వచ్చినట్లుగా పేల్చడానికి వీలులేదని స్పష్టంగా పేర్కొంది. రోజులో కేవలం రెండు గంటలపాటు టపాసులు పేల్చడానికి ఏపీ సర్కార్ అనుమతి ఇచ్చింది. రాత్రి 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రెండు గంటలపాటు టపాసులు కాల్చుకోవాలని రాష్ట్ర ప్రజలకు సూచించింది. దీపావళి పటాసులు వ్రికయించే షాపుల దగ్గర శానిటైజర్ వాడొద్దని సూచించింది.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశాల ప్రకారం ఏపీలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కరోనా నేపథ్యంలో దీపావళి వేడుకలపై చర్యలు తీసుకుంది. మరోవైపు కాలుష్య రహిత పటాసులు మాత్రమే విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది. టపాసులు విక్రయించే షాపుల మధ్య 10 అడుగుల దూరం ఖచ్చితంగా పాటించాలని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం సైతం దీపావళి వేడుకలపై సీరియస్‌గా ఉంది. ప్రాణాల కన్నా, ప్రజల ఆరోగ్యం కన్నా పండుగలు ఎక్కువ కాదని కేంద్రం సూచించినట్లుగానే ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టపాసుల దుకాణాల వద్ద 6 అడుగులు భౌతిక దూరం (Social Distncing) పాటించాలని పేర్కొంది.
- Also Read : AP: రెండోసారి కరోనా సోకడంతో యువ వైద్యుడి మృతి
కరోనా వైరస్ కేసులు పెరగడం, దేశ రాజధానిలో కాలుష్యం తీవ్రత అధికం కావడంతో ఢిల్లీ ప్రభుత్వం తొలుత టపాసుల విక్రయాలపై నిషేధం విధించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ సైతం టపాసుల విక్రయాలపై నిషేధం విధించాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఈ నేపథ్యంలో ఉత్తరాదిన 6 రాష్ట్రాలు టపాసుల విక్రయాలపై నిషేధం విధించారు. ఏపీలో కేవలం 2 గంటల మేర పటాసులు కాల్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అనుమతి ఇచ్చింది.
-
IPL 2020 Funny Memes: వైరల్ అవుతున్న ఐపీఎల్ 2020 ఫన్నీ మీమ్స్
- ‘KCRకు దుబ్బాకలో దీపావళి గిఫ్ట్.. జీహెచ్ఎంసీలో సంక్రాంతి గిఫ్ట్’
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe