హిమాలయాల్లోని సుమారు 2500 ఆల్టిట్యూడ్ పై ఒక నాగుపాము కనిపించింది. ఇంత ఎత్తులో కింగ్ కోబ్రా కనిపించడం ఇదే మొదటి సారి.
హిమాలయాల్లోని సుమారు 2500 ఆల్టిట్యూడ్ పై ఒక నాగుపాము కనిపించింది. ఇంత ఎత్తులో కింగ్ కోబ్రా కనిపించడం ఇదే మొదటి సారి. ఇంత ఎత్తులో నాగరాజు కనిపించడం చాలా అరుదు అని నిపుణులు అంటున్నారు.
ఉత్తరాఖండ్ లో ఒక ఆటవి శాఖ టీమ్ కింగ్ కోబ్రా ప్రజాతులు అంత ఎత్తులో ఉండే అవకాశం ఉందా అని వెతికింది.
వారి నివేదిక ప్రకారం...రెండున్నర వేల అడుగుల అల్టిట్యూడ్ లో కింగ్ కోబ్రా జాడ తెలిసింది. నైనితాల్ లోని ముక్తేశ్వర్ లో ఈ నాగుబాము కనిపిచింది. ఇది అసాధారణం.
సాధారణంగా నాగరాజు ఉష్ణమండల ప్రాంతాల్లో నివసించడానికి ఇష్టపడుతుంది. అయితే నైనితాల్ వంటి పర్వత ప్రాంతాల్లో..అది కూడా జీరోకు తగ్గే వాతావరణంలో అది ఎలా నివసిస్తోందో అనే ప్రశ్న ఇప్పడు అందరినీ తొలచివేస్తోంది.
తూర్పు, పశ్చిమ ఘాట్స్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలతో పాటు, ఒడిశాలో ఇవి కనిపిస్తాయి.