Covid-19 tests: హైదరాబాద్: హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో కరోనావైరస్ ( Coronavirus ) పరీక్షలు చేయకపోవడంపై తెలంగాణ హైకోర్టు ( Telangana High Court ) విస్మయం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న కరోనా పరీక్షలు, బాధితులకు అందుతున్న చికిత్సపై మంగళవారం హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. గాంధీలో కూడా కరోనా పరీక్షలు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. అయితే.. ప్రైవేటు ఆసుపత్రుల ఆగడాలు రాష్ట్రంలో పెరుగుతున్నాయని, కేంద్రం కల్పించిన అధికారాలతో వాటిని నియంత్రించాలని తెలంగాణ ప్రభుత్వానికి ( Telangana Govt ) సూచించింది. Also read: Telangana: డా. శ్రీరామ్‌ను అభినందించిన ఉపరాష్ట్రపతి
కరోనా సోకిన రోగులకు 4లక్షలకు పైగా బిల్లులు వేసిన యశోద, కిమ్స్ తదితర ఆసుపత్రులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
అలాగే ప్రైవేటు కేంద్రాల్లో అన్ని రకాల పరీక్షలకు గరిష్ట చార్జీల ధరలను ఖరారు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆసుపత్రుల్లో ఉన్న వసతులు బెడ్లు, వెంటిలేటర్ల వివరాలను ఎప్పటికప్పుడు ప్రచారం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. నాచారం ఆసుపత్రిలో కరోనా చికిత్సలు అందిస్తారో లేదో చెప్పాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ మేరకు ప్రభుత్వం పూర్తి వివరాలతో ఈ నెల 27లోగా నివేదికను సమర్పించాలని ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. Also read: Rajastan crisis: పైలట్ చేతుల్లో ఏం లేదు.. డ్రామా అంతా బీజేపిదే: అశోక్ గెహ్లట్
Telangana: ఆ ఆసుపత్రుల సంగతేంటి: హైకోర్టు