Jio: జియో 4 ప్లాన్లను సవరణ చేసింది.. కొత్త రీఛార్జి ప్లాన్స్ ఈ ఫుల్ బెనిఫిట్స్ అస్సలు మిస్సవ్వకండి..

Jio Revised Latest Plans: ప్రైవేట్ దిగ్గజ కంపెనీ రిలయన్స్ జియో నాలుగు ప్లాన్లను సవరణ చేసింది. అందులో రెండు డేటా యాడ్‌ ఆన్‌ ప్లాన్స్ రూ.69, రూ. 139 ప్యాక్ లు..  ఈ టెలికాం కంపెనీ రూ. 448 రీఛార్జ్ ప్యాక్ ని కూడా అప్డేట్ చేసింది. ఇక రూ.189 ప్లాన్‌ మళ్ళీ పరిచయం చేసింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం
 

1 /5

గతంలో రూ.69 రూ.139 రూపాయల రీఛార్జ్ డేటా ప్లాన్ యాక్టీవ్‌ ఉన్నన్ని రోజులు వర్తించేది. అంటే ఒకవేళ మీ బేస్‌ రీఛార్జ్ ప్యాక్ 30 రోజుల వ్యాలిడిటీ ఉంటే ఈ డేటా ప్యాక్‌ కూడా 30 రోజులపాటు వ్యాలిడిటీ ఉండేది. అయితే ఈ ప్లాన్లో సవరణ చేసింది జియో. ప్రస్తుతం ఈ ప్లాన్ వ్యాలిడిటీ కేవలం 7 రోజులు మాత్రమే వర్తిస్తుంది. గతంలో నెలరోజుల పాటు ఇచ్చిన వ్యాలిడిటీ ఇప్పుడు వర్తించదు. కేవలం ఒక వారంలో ఈ డేటా యాడ్ ఎక్స్‌ఫైర్‌ అయిపోతుంది.  

2 /5

 జియో రూ. 69 రీఛార్జి ప్లాన్లో 6 జిబి డేటా హై స్పీడ్ పొందుతారు. ఇక 139 ప్లాన్ లో 12 జిబి డేటా పొందుతారు. ఇంటర్నెట్ డేటా పూర్తయిన తరవాత 64 కేబీపీఎస్‌ స్పీడ్ కి తగ్గిపోతుంది.. అయితే ఇవి కేవలం డేటా ప్లాన్స్ మాత్రమే.. ఇందులో వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ అందుబాటులో ఉండవు .ఇప్పటికే యాక్టివ్గా ఉన్న బేస్ ప్లాన్‌కు ఇవి యాడ్‌ ఆన్‌ చేసుకోవాలి.   

3 /5

 ఇది కాకుండా రిలయన్స్ ఇటీవల నిలిపివేసిన ప్లాన్‌ మళ్లీ ప్రారంభించింది.ట్రయ్‌ ఆదేశాల మేరకు మళ్ళీ తిరిగి ప్రారంభించింది. రూ.189 ప్యాక్‌ ఇందులో 28 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. దీంతో పాటు 2 జిబి డేటా కూడా.  

4 /5

 ఇది కాకుండా అపరిమిత వాయిస్ కాలింగ్, 300 ఎస్ఎంఎస్లు పొందుతారు. ఇక జియో వినియోగదారులకు ఇతర జియో సర్వీస్ కూడా అందుబాటులో ఉంటుంది. అంటే జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ స్టోరేజ్ కూడా ఉంటుంది.  

5 /5

 జియో ఈ మధ్యకాలంలో రూ. 448 రీఛార్జ్ ప్లాన్ ధరను కూడా తగ్గించింది. ప్రస్తుతం దీని ధర రూ.445 రూపాయలు మాత్రమే.. దీని వ్యాలిడిటీ 28 రోజులు ప్రతిరోజు 2 జీబీ డేటా పొందుతారు. అపరిమిత వాయిస్ కాల్స్ తో పాటు 100 ఎస్ఎంఎస్ లు ఉచితం. ఇది కాకుండా సబ్స్క్రైబర్లు ఓటిటీలు కూడా యాక్సెస్ పొందగలరు. ఇందులో జీ5, జియో సినిమా ప్రీమియం, సోనీ లైవ్, లయన్స్ గేట్ ప్లే వంటివి యాక్సెస్ పొందుతారు