Star Actress Divorce: పెళ్లయిన కొద్ది రోజులకే విడాకులకు సిద్ధమైన స్టార్ హీరో, హీరోయిన్..!

Star Hero Divorce: బాలీవుడ్ స్టార్ జంట కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ విడాకుల వార్తలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. సైఫ్ తన టాటూను తొలగించుకోవడం, కరీనా భావోద్వేగ పోస్ట్ షేర్ చేయడం వంటి అంశాలు ఈ ఊహాగానాలకు కారణమయ్యాయి. అయితే వీరి విడాకులపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన ఏమీలేదు. 

1 /5

ఇటీవల బాలీవుడ్ స్టార్ జంట కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ విడాకుల గురించి అనేక వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజముందో స్పష్టత లేదు. 

2 /5

సైఫ్ అలీ ఖాన్ తన భుజంపై ఉన్న కరీనా పేరుతో ఉన్న టాటూను తొలగించుకున్నాడనే వార్త బయటకు రావడంతో వీరి మధ్య విబేధాలు పెరిగినట్టుగా భావించారు. అంతేకాకుండా, కరీనా కపూర్ ఇటీవల తన సోషల్ మీడియాలో పెళ్లిళ్లు, విడాకులు, జీవిత సంఘటనల గురించి భావోద్వేగ పోస్ట్ పెట్టింది. దీంతో నెటిజన్లు వీరి విడాకులు ఖాయమని అభిప్రాయపడ్డారు.

3 /5

కరీనా-సైఫ్ విడాకుల గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ జంట గతంలో కూడా ఇలాంటి పుకార్లను ఎదుర్కొంది. కరీనా, సైఫ్ గతేడాది తమ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం, వారి కుటుంబంతో కలిసి సంతోషంగా గడపడం వల్ల ఇవన్నీ కేవలం పుకార్లు కావచ్చు అని కొంతమంది భావిస్తున్నారు.

4 /5

అయితే బాలీవుడ్ మీడియాలో.. చక్కర్లు కొడుతున్న.. వీరిద్దరి విరాకుల వార్తలు అభిమానులను కొంత గందరగోళానికి గురిచేశాయి. అయితే కరీనా, సైఫ్ వారి వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా బయట పెట్టకుండా ఉండటంతో ప్రస్తుతం ఈ విషయంపై అంతగా క్లారిటీ లేదు.

5 /5

స్టార్ సెలబ్రిటీల గురించి పుకార్లు సర్వసాధారణం. కరీనా-సైఫ్ విడాకుల గురించి వచ్చే వార్తలు నిజమైనవా కాదా అనేది తేలాలంటే వీరిద్దరి అధికారిక ప్రకటన కోసం వేచిచూడాలి.