Razakar Aha OTT: కొన్ని చిత్రాలు థియేట్రికల్ గా ఫ్లాప్ అయినా.. టీవీల్లో ఓటీటీ వేదికల్లో బ్లాక్ బస్టర్స్ గా నిలుస్తుంటాయి. గతంలో మహేష్ బాబు హీరోగా నటించిన ‘అతడు’, ఖలేజా’ చిత్రాలు టీవీల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. తాజాగా రజాకార్ మూవీ కూడా ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. అక్కడ నెంబర్ వన్ ట్రెండింగ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాబీ సింహ, వేదిక, అనిష్క త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ లీడ్ రోల్స్ లో నటించిన రజాకార్ చిత్రం ఆహా ఓటీటీలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఈ చిత్రాన్ని సమర్వీర్ క్రియేషన్స్ ఎల్ఎల్పి బ్యానర్‌పై గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు. యాట సత్యనారాయణ డైరెక్ట్ చేశారు. 1940 దశకంలో రజాకార్లు సాగించిన అకృత్యాలకు తెర రూపమిచ్చిందీ మూవీ. లాస్ట్ ఇయర్ మార్చి 15న థియేటర్స్ లో రిలీజై మంచి విజయాన్ని అందుకున్నది. అంతేకాదు ఈ చిత్రానకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రతి రివ్యూలోనూ సినిమా మేకింగ్ , సీన్స్ బాగున్నాయంటూ విశ్లేషకులు అప్రిషియేట్ చేశారు.
థియేట్రికల్ రిలీజ్ అయిన పది నెలల తర్వాత రజాకార్ మూవీ ఆహా ఓటీటీలోకి వచ్చింది. గత నెల 24వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. స్టార్ హీరోలతో పోటీ పడుతూ ఈ సినిమా నెం.1 ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే 50 మిలియన్ మినిట్స్ ఫ్లస్ వ్యూయర్ షిప్ అందుకుని దూసుకెళుతోంది.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
రజాకార్ వ్యవస్థను నేపథ్యంగా ఎంచుకుని కథే హీరోగా దర్శకుడు యాట సత్యనారాయణ ఈ సినిమాను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ఆద్యంతం ఆకట్టుకునేలా రజాకార్ సినిమాను దర్శకుడు యాట సత్యనారాయణ తెరకెక్కించిన తీరు సాధారణ ప్రేక్షకుల నుంచి సినీ ప్రముఖుల దాకా అందరి ప్రశంసలు అందుకుంటోంది. సాంకేతిక నిపుణుల ప్రతిభతో పాటు బాబీ సింహ, వేదిక, అనిష్క త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ నటన ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.