Honda Activa 7G New Model 2025: కొత్త హోండా యాక్టివా 7G చూశారా? మైలేజీ, ఫీచర్స్‌ వివరాలు ఇవే!


Honda Activa 7G New Model 2025: యాక్టివా 7G స్కూటర్‌ మార్కెట్‌లోకి అనేక రకాల కొత్త ఫీచర్స్‌తో విడుదల కాబోతోంది. ఇది ప్రీమియం డిజైన్‌తో అందుబాటులోకి రానుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి. 

Honda Activa 7G New Model 2025: ప్రముఖ మోటర్‌సైకిల్ కంపెనీ హోండా యాక్టివా స్కూటర్‌ సిరీస్‌ను కంటిన్యూగా ఆప్డేట్‌ వేరియంట్స్‌లో విడుదల చేస్తూ వస్తోంది. హోండా కంపెనీ అతి త్వరలోనే ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌తో కూడిన యాక్టివా 7G స్కూటర్‌ను లాంచ్‌ చేయబోతోంది. ఇది అద్భుతమైన శక్తివంతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా అందిస్తోంది. ఇవే కాకుండా ఈ స్కూటర్‌లోనే అనేక కొత్త ఫీచర్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్కూటర్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
 

1 /5

ఈ యాక్టివా 7G స్కూటర్‌లో వచ్చే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌లో ప్రత్యేకంగా డాష్‌బోర్డ్ నావిగేషన్, కాల్ నోటిఫికేషన్‌ సపోర్ట్‌లను కూడా అందిస్తోంది. ఈ ప్రత్యేకమైన స్కూటర్‌ అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇందులో స్పెషల్ LED లైటింగ్‌ హైలైట్‌గా చెప్పొచ్చు.  

2 /5

హోండా కంపెనీ స్కూటర్‌లో అద్భుతమైన అండర్-సీట్ స్టోరేజ్‌ను కూడా అందిస్తోంది. ఇందులో ఎర్గోనామిక్స్ రైడర్ సౌకర్యాన్ని అందిస్తోంది. ఇక దీనిని కంపెనీ స్పెషల్ 109.51cc BS6 ఇంజన్‌తో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. దీని ఇంజన్‌ 8.84 Nm టార్క్‌తో పాటు 7.79 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది.  

3 /5

ఇక ఈ స్కూటర్‌ లీటర్‌ పెట్రోల్‌కి దాదాపు 68 కి.మీ మైలేజీని అందిస్తుందని మార్కెట్‌లో టాక్‌ నడుస్తోంది. అంతేకాకుండా ఇందులో హోండా కంపెనీ ప్రత్యేకమైన ABS వంటి భద్రతా ఫీచర్స్‌ను కూడా అందిస్తోంది. అలాగే ఇందులో  జియో-ఫెన్సింగ్ వంటి ఆధునిక సాంకేతికతలను కూడా జత చేయబోతున్నట్లు తెలుస్తోంది.   

4 /5

హోండా యాక్టివా 7G స్కూటర్‌ మార్కెట్‌లోకి విడుదలైతే.. ఎలక్ట్రిక్‌ స్కూటర్స్‌తో పాటు మార్కెట్‌లో అద్భుతమైన డిమాండ్‌ కలిగిన బైక్‌లకు పోటీ పడే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. భద్రతా పరంగా హోండా కంపెనీ అనేక రకాల ప్రత్యేకమైన ఫీచర్స్‌ను తీసుకు రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.   

5 /5

ఈ హోండా యాక్టివా 7G స్కూటర్‌ సంబంధించిన ఫీచర్స్‌, విడుదల తేదిని హోండా కంపెనీ త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అతి తక్కువ ధరలోనే అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.