Rashmika Mandanna: విజయ్ దేవరకొండ పై రష్మిక సెటైర్.. అందరికీ దయ తగ్గిపోతుంది అంటూ..!

Rashmika Mandanna Viral Post: నిన్నటి నుంచి రష్మిక కుంటుకుంటూ వచ్చినా కానీ.. విజయ్ సాయం అందించకపోవడం కి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రష్మిక మందన్న అందరూ దయతో ఉండండి అంటూ వేడుకుంది. ప్రస్తుతం రష్మిక షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

1 /5

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక ఇటీవల జిమ్ లో గాయపడిన విషయం తెలిసిందే.  అంతేకాదు కుంటుకుంటూ తాను నటిస్తున్న ఛావా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో.. కూడా కనిపించింది. 

2 /5

ఇక నిన్నటికి నిన్న ఒకే జిమ్ నుంచి కొద్ది నిమిషాల తేడాతో.. విజయ్ దేవరకొండ, రష్మిక బయటకి వచ్చే వీడియో వైరల్ అయింది. ఇందులో విజయ్ దేవరకొండ తనంతట తను వెళ్ళిపోగా.. ఆ తరువాత రష్మిక మాత్రం కుంటుకుంటూ వచ్చింది. కానీ విజయ్ మాత్రం ఆమెకు ఎటువంటి సాయం చేయలేదు.

3 /5

ఇప్పుడు సడన్ గా అందరూ దయతో ఉండండి అంటూ ఒక పోస్ట్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ. “ఈ రోజుల్లో అందరిలో దయ తగ్గిపోతుంది.  నేను మాత్రం అందరిని ఒకేలా చూస్తాను.  మీరంతా కూడా అలాగే ఉండండి అంటూ” రాసుకుంది. 

4 /5

అంతే కాదు తాను ధరించిన టీ షర్టు మీద కూడా కైండ్ ఫుల్ అని రాసి ఉంది.  అయితే ఈ కామెంట్స్ వెనుక రష్మిక,  విజయ్ దేవరకొండ జిమ్లో కలిసి కనిపించిన వీడియో.. కారణం అయ్యుండొచ్చు అని ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. 

5 /5

రష్మిక జిమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత విజయ్ కార్లో కూర్చోగా రష్మిక కాలికి ఉన్న గాయం కారణంగా ఇబ్బంది పడుతూ కారు ఎక్కింది. దీంతో విజయ్ పై కొంతమంది విమర్శలు చేశారు.