Nandamuri Vasundhara: మోహన్ బాబు తన కొడుకు మంచు విష్ణు, మంచు లక్ష్మి తో కలసి నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎన్బీకే అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నారు. ఈ క్రమంలో వాళ్ల మధ్య జరిగిన సంభాషణ వార్తలలో నిలిచింది.
నటుడు మోహన్ బాబు కుటుంబం గొడవ ప్రస్తుతం ఇటురాజకీయాలతో పాటు ఇటు ఇండస్డ్రీలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల మోహన్ బాబు, మంచు మనోజ్ లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎదుట హజరయ్యారు. అక్కడ కూడా వీరిద్దరు వాదోపవాదాలు చేసుకున్నారు.
ఈక్రమంలో మోహన్ బాబు .. జల్ పల్లిలోని తన నివాసంలో మంచుమనోజ్ అక్రమంగా ఉంటున్నాడని, అది తన స్వార్జీతమన్నారు. అంతే కాకుండా.. మంచుమనోజ్ ను ఇళ్లు ఖాళీ చేయించేలా ఆదేశించాలని కలెక్టర్ కు ఫిర్యాదు సైతం చేశారు. దీనిపై విచారణ జరిపిన కలెక్టర్ మరోసారి తమ ముందుకు రావాలని నోటీసులు ఇచ్చారు.
అయితే.. మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మి లు బాలయ్య బాబు అన్ స్టాపబుల్ కార్యక్రమానికి హజరయ్యారు. ఈ క్రమంలో చిన్ననాటి సంఘటనలను బాలయ్య,మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు. చిన్నప్పుడు మంచు మనోజ్ , బ్రాహ్మాణిని కొట్టేడాని బాలయ్య చెప్పారు.
ఆ సమయంలో బ్రాహ్యణి ఏడుస్తు వెళ్లి ఆమె తల్లి వసుంధరతో చెప్పింది. దీంతో వసుంధర ఇలాంటి పనులు చేయోద్దని సున్నితంగా మనోజ్ కు చెప్పిందంట. చిన్నతనంలో జరిగిన విషయాన్ని బాలయ్య మరోసారి ఫన్నీగా గుర్తుచేసుకున్నారు.
మరల మంచు విష్ణు, మంచు లక్ష్మి తమకు బాలయ్య బొమ్మలు కొనిచ్చారని విషయంను గుర్తు చేసుకున్నారు. అంతే కాకుండా షూటింగ్ జరిగినప్పుడు తమకు బాలయ్య ఎంతో అండగా నిలిచారని కూడా చెప్పారు.
ఈ క్రమంలో చిన్నతనంలోని అనేక విషయాలను మోహన్ బాబు కుటుంబం బాలయ్యతో సరదాగా గుర్తు చేసుకుని మరీ మాట్లాడుకున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం మంచు మనోజ్, మోహన్ బాబుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వసుంధర వార్నింగ్ ఇచ్చిందంటే.. ఇప్పటి విషయంలో ఆమె మనోజ్ పై ఫైర్ అయ్యిందా.. అని కొంత మంది షాక్ కు గురయ్యారు. తర్వాత అసలు విషయం తెలుసుకుని నోరెళ్లబెడుతున్నారు.