Latest Govt Jobs 2025: రూ.35 వేల జీతంతో ప్రభుత్వ జాబ్‌ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు!

Women Development And Child Welfare Department Job Notification: నిరుద్యోగ యువతకు ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లోని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన ఓ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Women Development And Child Welfare Department Job Notification: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు అద్భుతమైన గుడ్ న్యూస్.. సోషల్ కౌన్సిలర్ అనే పోస్టులను త్వరలోనే కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయబోతున్నట్లు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలను కూడా క్లుప్తంగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. 
 

1 /5

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లా కలెక్టర్లు అర్హత కలిగిన వ్యక్తుల నుంచి దరఖాస్తులను కోరుతూ ప్రత్యేకమైన నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా జీతాలను కూడా అందులో వెల్లడించారు.   

2 /5

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన జీతాల వివరాల్లోకి వెళితే.. ఎంపికైన అభ్యర్థుల నెల జీతం రూ.35,000 నుంచి ప్రారంభం కాబోతోంది. అంతేకాకుండా ఇతర బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించిన అభ్యర్థుల దరఖాస్తులను కోరుతూ కలెక్టర్ ప్రత్యేకమైన నోటిఫికేషన్ తిరుపతి చేశారు..

3 /5

ఇక ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఫిబ్రవరి 15వ తేదీలోపు అప్లై చేసుకోవచ్చు. గరిష్ట వయోపరిమితి వివరాలను కూడా నోటిఫికేషన్ లో వెల్లడించారు. గరిష్ట వయసు 42 సంవత్సరాలుగా ఇందులో పేర్కొన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ అధార్ క్యాస్ట్ పీపుల్స్‌కి ఐదేళ్లపాటు వయస్సు సడలింపులు వర్తిస్తాయని నోటిఫికేషన్ లో తెలిపారు.  

4 /5

అలాగే ఇందులో పోస్టింగ్ వివరాలను కూడా పేర్కొన్నారు.. ముందుగా ఈ ఉద్యోగంలో ఎంపికైన అభ్యర్థులు వైయస్సార్ కడప జిల్లాకు సంబంధించిన గృహహింస విభాగంలో పోస్టింగ్ అందించబోతున్నట్లు నోటిఫికేషన్‌లో తెలిపారు. దీనిని ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.   

5 /5

ఇక ఈ ఉద్యోగానికి సంబంధించిన అప్లై వివరాల్లోకి వెళితే.. ముందుగా సంబంధిత అప్లికేషన్ డౌన్లోడ్ చేసి అందులో అన్ని రకాల ఫార్మ్స్‌ని ప్రింట్ తీసుకొని డీటెయిల్‌గా అన్నీ ఫిల్ చేసి.. ఫిబ్రవరి 15వ తేదీ లోపు సంబంధిత కార్యాలయానికి అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.