Keerthy Suresh: వారెవ్వా.. బోల్డ్ లుక్‌లో మైండ్ బ్లాంక్ చేస్తున్న కీర్తి సురేష్.. పిక్స్ వైరల్..

Keerthy Suresh Akka movie: కీర్తి సురేష్ లేడీ డాన్ గా నటించిన అక్క మూవీ వెబ్ సిరిస్ ఫస్ట్ లుక్ టీజర్ ను ఇటీవల మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం దీని పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి.
 

1 /6

కీర్తిసురేష్ ఇప్పటి వరకు కన్పించని పాత్రలో అభిమానుల ముందుకు రానున్నారు.  ఇప్పటికే అక్క మూవీ టీజర్ చూసి ఫ్యాన్స్ షాక్ కు గురౌతున్నారు. మహానటిలో ఈ రెంజ్ లో ఎలివేషన్స్ అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేదని కామెంట్లు చేస్తున్నారు.  

2 /6

మహానటి ఇటీవల రిలీజ్ చేసిన అక్క మూవీ టీజర్ గురించి సోషల్ మీడియాలో తెగ రచ్చ నడుస్తోంది. యష్ రాజ్ ఫిలిమ్స్, నెట్ ఫ్లిక్స్ సంయుక్తంగా ఈ వెబ్ సిరిస్ ను రూపొందించాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తయ్యింది. నెట్ ఫ్లిక్స్ లో.. ఫస్ట్ లుక్ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.

3 /6

 దీనిలో.. పెర్నూరుకు చెందిన ఒక అమ్మాయి అక్కలపై ప్రతీకారం తీర్చుకొవాలని చూస్తుందని ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కనుంది. దీనిలో బాలీవుడ్ నటి రాధికా ఆప్టే ప్రధాన పాత్రలో నటించారు.  

4 /6

కీర్తిసురేష్ తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తట్టిల్ ను గోవాలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయ్యాక కూడా.. మహానటి ఏ మాత్రం తగ్గేదేలా అన్నట్లు మంగళ సూత్రంతో ఫోటోషూట్ లో పాల్గొన్నారు. బేబీ జాన్ మూవీ అంతగా హిట్ ను సొంతం చేసుకొలేదు.

5 /6

మహానటి.. పెళ్లి తర్వాత తన లైఫ్ గురించి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఆంటోనీ తట్టిల్ కు సిగ్గేక్కువ అని.. అతను ఫోటోలకు దూరంగా ఉంటాడని చెప్పుకొవచ్చింది. తన జీవితం పెళ్లికి ముందులాగానే హ్యాపీగా ఉందని కూడా చెప్పుకొచ్చింది.

6 /6

అయితే.. మహానటి అక్క లుక్ ను చూసి నెటిజన్లు మాత్రం భలే క్రేజీగా ఫీలవుతున్నారు. ఈ మూవీ  చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు   కీర్తిసురేష్ ఇటీవల మంగళసూత్రం లేకుండానే ఫోటోషూట్ లో పాల్గొన్నారు. దీనిపైన పెద్ద రచ్చ కొనసాగింది. తాజాగా.. అక్క మూవీ బోల్డ్ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి.