Brihaspati favourite zodiac sign: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.. నేటి నుండి దశ మారనుందా..?

February astrology: అన్ని రాశుల వారికి శుభగ్రహంగా భావించే బృహస్పతి ప్రస్తుతం వృషభ రాశిలో కొనసాగుతున్నారు.. మే నెలలో బృహస్పతి గ్రహం  మిధున రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకించి కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారంగా మారనుంది. 

1 /8

ఫిబ్రవరి 4న గురు వాఘవాన్ వక్ర నివర్తిని పొందాడు. ఈ నెలలో జరిగే అతి ముఖ్యమైన జ్యోతిష్య సంఘటనగా ఇది పరిగణించబడుతోంది. గురు వక్ర నివర్తి ప్రభావం అన్ని రాశుల వారిపై కనిపిస్తుంది.  అయితే కొన్ని రాశుల వారికి దీనివల్ల మరిన్ని శుభ ప్రయోజనాలు కలగబోతున్నాయి. మరి ఈ రాశి కారణంగా ఏ రాశుల వారికి శుభం కలగబోతుందో ఇప్పుడు చూద్దాం.   

2 /8

మేషరాశి వారికి మే నెలలో జరిగే బృహస్పతి వక్ర నివర్తి కారణంగా ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ సంబంధాలు బలపడతాయి. కొత్త పెట్టుబడికి అవకాశాల కోసం ఎదురుచూడండి. తెలివిగా అడుగులు వేస్తే మనసు ఉల్లాసంగా ఉండడమే కాకుండా జేబు కూడా నిండుతుంది.   

3 /8

సింహరాశి వారికి కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కానీ అధిక పని అలసటకు దారితీస్తుంది. డబ్బును తెలివిగా పెట్టుబడి పెడితే మీకు భవిష్యత్తులో ఆ డబ్బు సహాయపడుతుంది. ముఖ్యంగా ఖర్చులను నివారించండి. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు ఉన్నత విద్యను అభ్యసించాలనే విద్యార్థులకు మంచి సమయం, మంచి ఉద్యోగం కూడా సంపాదించించవచ్చు.   

4 /8

వృశ్చిక రాశి వారికి కూడా అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. వ్యాపార పారిశ్రామిక రంగాలలో లాభాలు అర్జించే అవకాశాలు ఉన్నాయి. పెండింగ్ పనులు పూర్తయితాయి. భాగస్వామ్యంలో మంచి ఆర్థిక లాభాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేస్తారు 

5 /8

ధనస్సు రాశి వారికి కూడా అనుకూలంగా ఉండనుంది. ముఖ్యంగా మే నెల నుంచి వీరికి పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా పరిస్థితులు మారనున్నాయి. వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు పెరుగుతున్నాయి. శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో సంతోషకరమైన సంఘటనలు జరుగుతాయి. 

6 /8

కుంభ రాశి వారికి ఆర్థిక లాభాలు పెరుగుతాయి. పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి.  ఉద్యోగంలో పదోన్నతి ,జీతం పెరుగుదలకు అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి 

7 /8

ఇంక ముఖ్యంగా గురు గ్రహం యొక్క అనుగ్రహం పొందాలి అంటే మీకు సమీపంలో ఉండే దేవాలయంలో గురువు మందిరం వద్ద దీపాలను వెలిగించి,  సెనగపప్పును దండగా సమర్పించడం వల్ల గురు గ్రహం యొక్క ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. 

8 /8

పైన అందించిన సమాచారానికి జీ న్యూస్ కి ఎటువంటి సంబంధం లేదు.