PM Kisan Samman Nidhi: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పెరుగుతుందని.. దీన్ని బడ్జెట్ ప్రసంగంలో ప్రకటిస్తారని ఎదురు చూశారు. అయితే, పీఎం కిసాన్ గురించిన ప్రస్తావన ఈ 2025-26 బడ్జెట్‌లో ఎలాంటి సమాచారం అందించలేదు. అయితే, 19వ విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు తెలుసా?
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా ఏడాదికి రూ.6000 రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం డీబీటీ ద్వారా సాయం అందిస్తుంది. అలా ఇప్పటి వరకు 18 విడతలు నిధులు మంజూరు చేసింది. ఏడాదికి మూడుసార్లు రూ.2000 చొప్పున రైతుల ఖాతాల్లో డబ్బులు జమా చేస్తారు.
అయితే, ఈ సాయం రూ.6000 నుంచి రూ.10,000 పెరగవచ్చని రైతులు ఎదురు చూశారు. కానీ, బడ్జెట్‌లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి గురించిన ఎలాంటి ప్రస్తావన రాలేదు. నిరాశే ఎదురైంది. అయితే, 19వ విడుత నిధుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.
2024 అక్టోబర్ 5వ తేదీ 18వ విడత పీఎం కిసాన్ నిధి డబ్బులను విడుదల చేశారు. అయితే, గత సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన 16వ విడుత నిధులను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఫిబ్రవరి 28న 19వ విడత నిధులు విడుదల చేయవచ్చని అంచనా.
2019 లో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధిని ప్రారంభించింది. చిన్నా సన్నకారు రైతులకు ఆర్థికంగా చేయూత అందించడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది. pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా లబ్దిదారులు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
అయితే, ఈ పథకం లబ్ది పొందాలంటే ముందుగానే కేవైసీ కూడా పూర్తి చేసుకుని ఉండాలి. అధికారిక వెబ్‌సైట్‌లో నేరుగా ఆన్‌లైన్‌లో కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. లేదా కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి పూర్తి చేసుకోవచ్చు. హైల్పలైన్ నంబర్ 1800115526 లో సంప్రదించవచ్చు.