LDL Reducing Tiny Tips: మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి కొన్ని చిన్న చిట్కాలు ఉన్నాయి. వీటిని ఫాలో అవుతే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతాయి.. దీంతో హార్ట్ ఎటాక్ అడ్రస్ లేకుండా పోతుంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
గ్రీన్ టీ..
గ్రీన్ టీ లో కేటాచిన్స్ ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్ స్ట్రెస్ రాకుండా నివారిస్తాయి. మెటబాలిజం రేటుకు బూస్టింగ్ ఇస్తుంది. దీంతో బరువు తగ్గుతారు అంతేకాదు దానిమ్మ జ్యూస్ కూడా చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి సహాయపడతుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. దానిమ్మలోని ఖనిజాలు, పాలీఫెనల్స్ గుండె సమస్యలు రాకుండా కాపాడుతుంది, చెడు కొలెస్ట్రాల్ తగ్గించేస్తుంది.
ఫైబర్ ఫుడ్స్..
ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. కరిగే ఫైబర్ జీర్ణం ఎంజైమ్‌ల ఉత్పత్తికి కూడా తోడ్పడుతాయి. ఓట్స్, బార్లీ కొన్ని రకాల పండ్లు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోతాయి. ముఖ్యంగా కొన్ని సీట్రాస్ జాతి పండ్లు, యాపిల్లు తప్పకుండా తీసుకోవాలి. వీటి వల్ల కడుపు నిండిన అనుభూతి ఎక్కువ సమయం పాటు కలుగుతుంది.. అంతేకాదు అతిగా తినకుండా ఉంటారు.
వెల్లుల్లి..
వెల్లుల్లిలో ఔషధ గుణాలు పుష్కలం. కొన్ని నివేదికల ప్రకారం మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించే గుణం వెల్లుల్లి కలిగి ఉంటుంది.. వెల్లుల్లి రెబ్బలను నేరుగా తినడం వల్ల ప్రయోజనాలు పుష్కలం. లేదా ఆహారంలో కూడా వేసుకొని తీసుకోవాలి. వెల్లుల్లి రుచిపరంగా మాత్రమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా ఎన్నో లాభాలను కలిగిస్తుంది.
చక్కెర..
మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోవాలి అంటే చక్కర అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవద్దు. ముఖ్యంగా తెల్ల బ్రెడ్, పేస్ట్రీ, చక్కర అధికంగా ఉండే డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. వీటిని తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు.. మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా హఠాత్తుగా పెరిగిపోతాయి. దీంతో హార్ట్ ఎటాక్ సమస్యలు కూడా వస్తాయి. ఇవి కాకుండా కొన్ని రకాల పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు మన డైట్ లో చేర్చుకోవాలి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
ఇదీ చదవండి: పరీక్ష లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. రూ.1,40,000 జీతం, వెంటనే దరఖాస్తు చేసుకోండి..
యాక్టివిటీ..
ఆహారంలో మార్పులు మాత్రమే కాదు రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ వంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోతాయి. ప్రతిరోజు ఏరోబిక్ వంటివి చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు బ్రిస్క్ వాకింగ్ ,సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివి వారానికి ఒక్కసారైనా చేయటం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోతాయి. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. దీంతోపాటు బరువు అధికంగా పెరగకుండా ఉంటారు.
ఆరోగ్యకరమైన కొవ్వులు..
మన శరీరంలో కోళ్లు చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే శాచ్యురేటెడ్ కొవ్వులు ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఫ్యాటీ ఫిష్ , అవిసె గింజలు, చియా విత్తనాలు, వాల్నట్స్ తీసుకోవడం వల్ల తెలుగు చెడు కొలెస్ట్రాల స్థాయిలు తగ్గిపోతాయి. ఇది కాకుండా ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి. ఇందులో గుండెకు మేలు చేసే మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇక ఫ్రై చేసిన ఆహారాలు కూడా దూరంగా ఉండాలి.
ఇదీ చదవండి: జియో బంపర్ బొనాంజా ప్లాన్.. బడ్జెట్‌లో 2 జీబీ డైలీ డేటా, 13 ఓటీటీలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి