Venkatesh Family : దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన హీరోలు వెంకటేష్, రానా.. టాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్న వారే కాదు, తమ సినీ ప్రయాణంలో ఎన్నో విజయాలు సాధించారు. అయితే, దగ్గుబాటి ఫ్యామిలీ నుండి వచ్చిన మరో వ్యక్తి తమిళ సినిమా ఇండస్ట్రీలో మంచి హీరోగా గుర్తింపు సంపాదించాడు. ఇంతకీ అతను ఎవరు అనే విషయాన్ని ఒకసారి చూద్దాం..
దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వచ్చి వెంకటేశ్, రానా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతే తెలిసిందే. ముఖ్యంగా రామానాయుడు కడుకుగా తెరంగేట్రం చేసిన వెంకటేష్.. ఆ తరువాత తన వైవిధ్యమైన నటనతో.. స్టార్ హీరోగా ఎదిగారు. ఇక రామానాయుడు మరో కొరకు సురేష్ బాబు టాప్ నిర్మాతగా నిలిచారు.
ఇలా రామానాయుడు పిల్లల్లో ఒకరు స్టార్ హీరో మరొకరు స్టార్ట్ నిర్మాత అయ్యారు అనేదే చాలామందికి తెలుసు. అయితే రామానాయుడు ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో వ్యక్తి కూడా హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు అనేది ఎంతోమందికి తెలియని విషయం.
అతను మరెవరో కాదు..దగ్గుబాటి రాజా. రామానాయుడు సోదరుడి..కొడుకుగా తమిళ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించాడు. 30 వరకు తమిళ సినిమాల్లో హీరోగా నటించిన రాజా, అగ్ర నిర్మాతలు భారతీరాజా, మణిరత్నం వంటి వారితో పని చేశాడు. ఈ సినిమాల్లో అతడు కమల్ హాసన్, రజనీకాంత్, విజయ్ కాంత్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించడం సైతం జరిగింది. అంతేకాకుండా అనేక సూపర్ హిట్ సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు.
1981లో క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో చిన్న ముళ్ పెరియ ముళ్ సినిమాతో కోలీవుడ్లో అడుగుపెట్టాడు రాజా. ఇథు ఎంగల్ నీతి, కర్పూర ముల్లై, మూండ్రవధు కన్ వంటి సినిమాల్లో అతడు తన నటనతో అభిమానులను ఆకట్టుకున్నాడు.
తెలుగులో కూడా రాజా వైదేహి, సిరిపురం చిన్నోడు, ఝాన్సీ రాణి, చిన్నారి స్నేహం వంటి సినిమాల్లో నటించాడు. శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రంలో కర్ణుడిగా.. బాలకృష్ణతో నటించాడు. రాజా అసలు పేరు దగ్గుబాటి వెంకటేష్. కానీ వెంకటేష్ అప్పటికే హీరోగా ఫేమస్ కావడంతో, తన స్క్రీన్ నేమ్‌ను రాజా మార్చుకొని సినిమాల్లో నటించాడు.
రాజా 23 ఏళ్ల విరామం తరువాత బాలకృష్ణ సినిమాతో టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాల్లో నందమూరి త్రివిక్రమరావు పాత్రలో కనిపించాడు. అలాగే, స్కంద సినిమాలో హీరో రామ్ తండ్రిగా నటించాడు.