Chiranjeevi: ‘విశ్వంభర’ తర్వాత చిరంజీవి లైనప్ మాములుగా లేదుగా.. ఏకంగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ తో మెగా మూవీస్..

Chiranjeevi Lineup: మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో యంగ్ హీరోలకు ధీటుగా వరుస చిత్రాలు చేస్తున్నారు. కొత్త కొత్త కథలతో యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్  చూపెడుతున్నారు. అయితే విశ్వంభర సినిమా తర్వాత వరుసగా చేయబోయే దర్శకులను లైన్ లో పెట్టుకున్నారు.

1 /7

Chiranjeevi Lineup: చిరంజీవి 70 యేళ్లు దగ్గరవుతున్న పడుచు హీరోలకు ధీటుగా ఒక ప్రాజెక్ట్ తర్వాత మరొక ప్రాజెక్ట్ కు ఓకే చెప్పేస్తున్నారు. ఇప్పటికే ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఎవరితో చేస్తారనే దానిపై క్లారిటీ వచ్చేసింది.

2 /7

‘విశ్వంభర’ సినిమా తర్వాత దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టేనర్ చేయబోతున్నట్టు ప్రకటించారు. నాని నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ‘విశ్వంభర’ తర్వాత పట్టాలెక్కనుంది.

3 /7

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా వెంకటేష్ తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ హిల్లేరియస్ కామెడీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలుబడనుంది. ఈ సినిమాను ‘భగవంత్ కేసరి’ సినిమాను నిర్మించిన సాహూ గారపాటి నిర్మిస్తున్నారు.

4 /7

అటు చిరంజీవి తనకు  ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు బాబీతో మరోసారి యాక్షన్ ఎంటర్టైనర్ చేయడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్టు సమాచారం.

5 /7

మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేయాల్సింది. కానీ ఎందుకో అది ఆగిపోయింది. అయితే హరీష్ శంకర్ కొత్త స్టోరీ తో చిరంజీవిని ఒప్పించే పనిలో పడ్డారు.

6 /7

అటు ‘పక్కా కమర్షియల్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మారుతితో సినిమా చేయబోతన్నట్టు ప్రకటించారు. అయితే.. ప్రభాస్ తో ‘ది రాజా సాబ్’ మూవీ తర్వాత చిరంజీవితో చేయడం పక్కా అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్న మాట.

7 /7

మొత్తంగా చిరంజీవి 70 ఏజ్ లో కూడా వరుసగా యంగ్ డైరెక్టర్స్ తో ఎక్కడా గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారు. మొత్తంగా చిరంజీవి యంగ్ హీరోలకు గట్టి పోటీనే ఇస్తున్నాడు.