Union Budget 2025: సత్తా చాటిన తెలంగాణ..ఆ సర్వే రిపోర్ట్ లో మనమే టాప్..

Union Budget 2025: కోట్లాది ప్రజలు ఎదురు చూసే రోజు రానే వచ్చింది. ముఖ్యంగా బడా పారిశ్రామికవేత్తలు, పేదలకు ఈ బడ్జెట్ తో పెద్దగా ఒనగూరే ప్రయోజనం లేదనేది ఆర్ధిక వేత్తలు చెప్పేమాట. పన్నులు పెంచినా.. తగ్గించినా.. వీరిపై పెద్దగా ప్రభావం ఉండదు. అదే మిడిల్ క్లాస్ కామన్ మ్యానే పన్ను పెరిగినా.. తగ్గినా.. వారిపైనే ఎక్కువ ప్రభావం ఉంటుంద. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ సారి ప్రకటించిన ఆర్ధిక సర్వేలే తెలంగాణ సత్తా చాటింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 1, 2025, 07:40 AM IST
Union Budget 2025: సత్తా చాటిన తెలంగాణ..ఆ సర్వే రిపోర్ట్ లో మనమే టాప్..

Union Budget 2025: 2024 ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ వరుసగా మూడోసారి అధికారం చేపట్టింది. ఎన్నికల ఫలితాల తర్వాత కొత్త యేడాదిలో 2025-26 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఈ రోజు పార్లమెంట్ దిగువ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీనికి ముందు రోజు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఆర్ధిక సర్వేను ప్రకటించింది. అందులో పన్నుల రాబడిలో తెలంగాణ ముందు భాగంలో ఉందని ఆర్ధిక సర్వే స్పష్టం చేసింది.

ఈ విషయాన్ని పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో ప్రకటించారు.  15 పెద్ద రాష్ట్రాలతో పోల్చితే 88 శాతం సొంత పన్నుల రాబడుల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. దీంతో తెలంగాణ ఆర్థిక పరిపుష్టిని చాటిందని తెలిపింది.  వంద శాతం గ్రామీణ త్రాగునీరు సరఫరా కలిగిన రాష్ట్రంగా తెలంగాణ ఘనత సాధించిందని పేర్కొంది.

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

అలాగే ఐటీ (Information Technology)లో తెలంగాణ మేటి అని ఎకనమిక్ సర్వే మరోసారి తేల్చిచెప్పింది. కర్ణాటకతో పాటు తెలంగాణ కూడా అద్భుత ప్రగతి సాధించిందని పేర్కొంది. అంతేకాదు అత్యధిక ఇరిగేటెడ్ ఏరియాతో దేశంలోనే తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచిందన్నారు. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడంలో వి-హబ్ దేశానికి రోల్ మోడల్‌గా నిలిచిందని ఎకనమిక్ సర్వే లో తెలిపింది.

నిర్మలా సీతారామన్ ఈ సారి బడ్జెట్ లో ఎవరిపై  వరాల జల్లు కురిపించనున్నారనేది అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టాక్స్ కట్టేవాళ్లకు బడ్జెట్‌లో ఉపశమనం కలుగించనున్నారా అనేది ఈ రోజు తేలిపోనుంది. మరోవైపు  ఉద్యోగుల డిమాండ్స్‌పై ప్రకటనలు ఉంటాయానేది కూడా  ఆసక్తి రేకిస్తోంది. మరోవైపు మిడిల్ క్లాస్ పీపుల్ కు లబ్ది చేకూరేలా బడ్జెట్ ప్రసంగం ఉండనుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  ఇలా ఎన్నో అంచనాలతో ఈసారి బడ్జెట్ ప్రసంగం ఉండనుంది. ఇప్పటికే ఏడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల సీతారామన్ తాజాగా 8వ సారి పార్లమెంట్ లో  బడ్జెట్‌ ను  ప్రవేశపెట్టిన మహిళగా రికార్డు క్రియేట్ చేసారు. 

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News