Ind vs Eng 3rd T20: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మూడో టీ20 నేడే, ఇంగ్లండ్‌కు విషమ పరీక్ష

Ind vs Eng 3rd T20: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సీరీస్‌లో ఇవాళ జరిగే మూడవ టీ20పై టీమ్ ఇండియా కన్నేసింది. వరుసగా మూడో విజయంతో సిరీస్ చేజిక్కించుకునే ప్రయత్నంలో ఉంది. రెండు జట్లు బలాబలాలు, పిచ్ స్వభావం ఎలా ఉందో చూద్దాం

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 28, 2025, 09:59 AM IST
Ind vs Eng 3rd T20: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మూడో టీ20 నేడే, ఇంగ్లండ్‌కు విషమ పరీక్ష

Ind vs Eng 3rd T20: స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమ్ ఇండియా అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్ ఇండియా 2-0 ఆధిక్యంతో ఉండటంతో ఇవాళ జరిగే మూడో మ్యాచ్ విజయంతో సిరీస్ వశం చేసుకోవాలని యోచిస్తోంది. రాజ్‌కోట్ వేదికగా ఇవాళ జరగనున్న టీ20 అత్యంత ఆసక్తిగా మారింది. 

టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మూడవ టి20 ఇవాళ రాజ్‌కోట్ వేదికగా సాయంత్రం జరగనుంది. 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌‌తో మొదటి రెండు మ్యాచ్‌ల విజయంతో ఇండియా 2-0 ఆధిక్యంలో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో రాణిస్తున్న సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమ్ ఇండియా ఇవాళ్టి మ్యాచ్ గెలిస్తే సిరీస్ కైవసం అవుతుంది. సిరీస్ చేజారకుండా ఉండాలంటే ఇంగ్లండ్ ఇవాళ్టి మ్యాచ్ తప్పక గెలవాలి. టీమ్ ఇండియాలో అభిషేక్ శర్మ, తిలక్ వర్మ మంచి ఫామ్‌లో ఉండగా రింకూ సింగ్, నితీష్ కుమార్ రెడ్డిలు గాయం కారణంగా దూరంగా ఉన్నారు. ఇక అర్షదీప్, వరుణ్ చక్రవర్తిలు మంచి ఫామ్‌‌లో ఉన్నారు. ధృువ్ జురేల్ స్థానంలో శివమ్ దూబే, రవి బిష్ణోయ్ స్థానంలో మొహమ్మద్ షమి ఆడే అవకాశాలున్నాయి. ఈ రెండు మార్పులు తప్ప మిగిలిన జట్టంతా యధాతధంగా ఉండనుంది. సూర్యకుమార్ యాదవ్ నుంచి ఇంకా కెప్టెన్సీ ఇన్నింగ్స్ రావల్సి ఉంది. 

ఇక ఇంగ్లండ్ తుది జట్టును ప్రకటించింది. తొలి రెండు మ్యాచ్‌లో విఫలమైనా సరే ఫిల్ సాల్ట్, బెన్ డకెట్‌లకు మరో అవకాశం లభించింది. లివింగ్ స్టోన్ తనదైన శైలి చూపించలేకపోతున్నాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ మిడిల్ ఆర్డర్ చాలా బలహీనంగా ఉంది. కెప్టెన్ జోస్ బట్లర్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఇంగ్లండ్‌కు ఇవాళ్టి మ్యాచ్ డూ ఆర్ డై పరిస్థితి. ఎందుకంటే సిరీస్ భారత్ వశం కాకుండా ఉండాలంటే ఇవాళ్టి మ్యాచ్‌లో విజయం తప్పనిసరి. 

రాజ్‌కోట్ పిచ్ రిపోర్ట్

ఇది బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది. స్ట్రోక్ ప్లేకు అనువుగా ఉంటుంది. పేసర్లు వేరియేషన్‌తో బౌల్ చేయాల్సి ఉంటుంది. స్పిన్నర్లకు బాగుంటుంది. మ్యాచ్ జరిగే కొద్దీ స్పిన్నర్లకు అనువుగా మారవచ్చు. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుకు ప్రయోజనం ఉండవచ్చు. అందుకే టాస్ కీలకం కానుంది.

ఇంగ్లండ్ తుది జట్టు

బెన్ డకెట్, ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్, లివింగ్ స్టోన్, జామీ స్మిత్, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్‌వుడ్

టీమ్ ఇండియా అంచనా

సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, మొహమ్మద్ షమి, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి

Also read: Siraj, Zanai Love: ఆమె నా లవర్ కాదు.. చెల్లెలు లాంటిది: రూమర్లపై బాంబ్‌ పేల్చిన సిరాజ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News