Ginger Surprising Benefits: అల్లంలో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, విటమిన్ బీ6 ఉంటాయి. అంతేకాదు యాంటీ ఆక్సిడెంట్లు అయిన జింజోరెల్, షాగోల్ కూడా ఉంటాయి. అల్లం డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది. వికారం సమస్యలు తగ్గుతాయి. అల్లం మంచి డిటాక్సిఫికేషన్ డ్రింక్‌లా కూడా పనిచేస్తుంది. మీ రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం వల్ల బోలెడు ప్రయోజనాలు.
అల్లం తీసుకోవడం వల్ల వికారం తగ్గుతుంది. కడుపులో అజీర్తి సమస్యలకు సమర్థవంతంగా తగ్గిస్తుంది. అందుకే కడుపు సమస్యతో బాధపడుతున్న వారు అల్లం నీటిని తీసుకోవాలి. ఇది జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఆహారాన్ని విడగొట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అల్లం కడుపులో గ్యాస్, అజీర్తి రాకుండా నివారించి జీర్ణ ఆరోగ్య క్రియను మెరుగు చేస్తుంది. అంతేకాదు యాసిడ్ రీఫ్లక్స్, గుండె మంట ఉన్నవాళ్లు పచ్చి అల్లాన్ని నీటిలో కలుపుకొని కూడా తీసుకోవచ్చు.. ఇందులోని ఔషధ గుణాలు యాసిడ్ రీఫ్లక్స్ కాకుండా నివారిస్తుంది .
అల్లం లో థర్మోజెనిక్ గుణాలు ఉంటాయి. ఇది మెటబాలిజం రేటును పెంచుతుంది. తిన్న తర్వాత కాస్త అల్లం నమిలితే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇలా చేయడం వల్ల క్యాలరీలను కరిగించేస్తుంది. బరువు నిర్వహణలో ఉంటుంది, మనం తిన్న ఆహారంలో కొవ్వు అతిగా తింటే ఇది బర్న్ చేస్తుంది. ఆరోగ్యకరమైన బరువుకు ప్రేరేపిస్తుంది.
అల్లంలో ఉండే విటమిన్స్, మినరల్స్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడటానికి అల్లం ఉదయం పరగడుపున తీసుకోవాలి. ఇది పోషకాలకు పవర్ హౌస్. విటమిన్ సీ కూడా ఉండటం వల్ల సీజనల్ జబ్బులు రాకుండా పోరాడుతుంది.
ఇదీ చదవండి: స్ట్రాబెర్రీ ఈ రహస్యం తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు, రోజూ తింటారు..
అల్లం నీటిని తీసుకోవడం వల్ల మంచి డిటాక్సిఫికేషన్ డ్రింక్‌లా పనిచేస్తుంది. మన శరీరంలో ఉండే విష పదార్థాలను బయటికి పంపిస్తుంది. అల్లంలో నేచురల్ డైరుటిక్ గుణాలు ఉంటాయి. ఇది మన శరీరంలోని విష పదార్థాలను యూరిన్ ద్వారా బయటికి పంపించేస్తుంది.. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.
పచ్చి అల్లం తీసుకోవటం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. డయాబెటిస్తో బాధపడుతున్న వారు ఇన్సులిన్ నిరోధకతకు పచ్చి అల్లం నీటిని తీసుకోవాలి. ఇది హఠాత్తుగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా కాపాడుతుంది. అంతేకాదు పీరియడ్ పెయిన్స్‌తో బాధపడేవారు కూడా అల్లం తీసుకోవాలి.
ఇదీ చదవండి: ఈ బీఎస్ఎన్ఎల్ బంపర్ ప్లాన్‌తో మీ సిమ్ 10 నెలలు యాక్టీవ్.. ఉచిత కాలింగ్‌తోపాటు డేటా ఫ్రీ..
అల్లం నీటిని తయారు చేసుకునే విధానం..
ఒక ఇంచు అల్లం ముక్క తీసుకొని దాని శుభ్రంగా కడిగి తొక్క తీయాలి. ఇప్పుడు రెండు కప్పుల నీళ్లు తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసి బాగా ఒక మూడు నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత మరో ఐదు నిమిషాలు సిమ్‌లో ఉడికించుకోవాలి. ఆ నీటిని వడకట్టుకుంటే అల్లం నీరు రెడీ అవుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.