Strawberry: స్ట్రాబెర్రీ ఈ రహస్యం తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు, రోజూ తింటారు..

Strawberry Mind-blowing Benefits: స్ట్రాబెర్రీల రంగు మాత్రమే కాదు.. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్ట్రాబెర్రీలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే స్ట్రాబెరీ రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల కలిగే ఐదు అద్భుతమైన ప్రయోజనాలు తెలుసుకుందాం. 

Written by - Renuka Godugu | Last Updated : Jan 28, 2025, 08:56 AM IST
Strawberry: స్ట్రాబెర్రీ ఈ రహస్యం తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు, రోజూ తింటారు..

Strawberry Mind-blowing Benefits: స్ట్రాబెర్రీలు పోషకాలకు పవర్ హౌస్. ఇందులో ఖనిజాలు పుష్కలం. అంతేకాదు స్ట్రాబెరీలో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపడుతుంది.. అంతేకాదు స్ట్రాబెర్రీలో ఉండే విటమిన్ సి తో పాటు పొటాషియం కూడా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన శరీర పనితీరుకు ప్రేరేపిస్తుంది. మన బొక్కల ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయి. అంతేకాదు స్ట్రాబెర్రీ తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ పండ్లు సులభంగా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. వీటి ధరలు కూడా సాధారణంగానే ఉంటాయి. కాబట్టి స్ట్రాబెర్రీ పండులో ఉండే ప్రయోజనాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వీటిని డైట్‌లో చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం..

స్ట్రాబెరీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సిడేటీవ్‌ డ్యామేజ్‌ కాకుండా కాపాడుతాయి.  ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్, గుండె సమస్యల నుంచి ఈ పండ్లు రక్షిస్తాయి.. స్ట్రాబెర్రీలో ఆంథోనిసైనిన్స్‌ ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్ డ్యామేజ్ కాకుండా శరీరాన్ని కాపాడుతుంది. 

బరువు నిర్వహణ..
మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే స్ట్రాబెర్రీలు కూడా మీరు డైట్ లో చేర్చుకోవాలి. ఇందులో క్యాలరీలు తక్కువ మోతాదులో ఉండటంతో పాటు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.. ఇది కడుపు నిండిన అనుభూతిని ఎక్కువ సమయం పాటు కలిగిస్తుంది. జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. స్ట్రాబెరీలు తరచూ తీసుకోవడం వల్ల మలబద్ధక సమస్య కూడా నివారిస్తుంది. అంతేకాదు రక్తంలో చక్కెర స్థాయిలో అధికంగా ఉన్నవారు స్ట్రాబెర్రీలు తీసుకోవడం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది.

మెదడు పనితీరు..
స్ట్రాబెరీలు డైట్లో చేర్చుకున్న వారికి వయస్సురీత్యా వచ్చే అభిజ్ఞ సమస్యలకు చెక్‌ పడుతుంది. స్ట్రాబెరీలు మెదడు పనితీరును మెరుగు చేస్తాయి.. ఎందుకంటే ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్‌ ఆరోగ్యకరమైన మెదడు పనితీరుకు సహాయపడుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ రాకుండా నివారిస్తుంది.

ఇదీ చదవండి:  ఈ బీఎస్ఎన్‌ఎల్‌ బంపర్‌ ప్లాన్‌తో మీ సిమ్‌ 10 నెలలు యాక్టీవ్‌.. ఉచిత కాలింగ్‌తోపాటు డేటా ఫ్రీ..  

స్ట్రాబెరీలు తీసుకోవడం వల్ల ఇందులోని విటమిన్ సి చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇవి కొల్లెజెన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది. స్ట్రాబెర్రీలతో చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. ముఖంపై ఉన్న మచ్చలు, గీతాలు తొలగిస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు స్కిన్ డ్యామేజ్ కాకుండా యూవీ కిరణాల నుంచి రక్షిస్తుంది. తరచూ స్ట్రాబెర్రీలు తింటే మీ చర్మాన్ని లోపలి నుంచి రిపెయిర్‌ చేస్తుంది. వీటితో స్మూథీ లేదా సలాడ్‌ మాదిరి కూడా తినవచ్చు. స్ట్రాబెర్రీ పండ్లు నేరుగా తినడం కూడా మంచిదే. 

ఇదీ చదవండి: ఫిబ్రవరి నెలలో స్కూళ్లకు భారీగా సెలవులు.. ఎన్ని రోజులు తెలిస్తే ఎగిరిగంతేస్తారు..  

గుండె ఆరోగ్యం..
స్ట్రాబెరీలు తినడం వల్ల కార్డుగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్, పొటాషియం గుండె ప్రమాదం నుంచి రక్షిస్తుంది.. బీపీ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అంతేకాదు కొలెస్ట్రాల్ నివారిస్తుంది. ఇందులోని ఇన్ఫ్లమేషన్ గుణాలు స్ట్రాబెరీలు తరచుగా తీసుకోవడం వల్ల బ్లడ్ క్లాట్స్ కాకుండా కాపాడుతుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News