Guava Benefits: జాంకాయ రోజూ తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలివే

మెరుగైన ఆరోగ్యం కోసం సీజనల్ ఫ్రూట్స్ చాలా ఉపయోగకరం. ఇవి రుచిలోనే కాకుండా ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు అందిస్తాయి. సీజనల్ ఫ్రూట్‌లో అద్భుతమైంది, పెద్దఎత్తున పోషకాలున్నది జామ. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, లైకోపీన్, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ పెద్దఎత్తున ఉంటాయి. 

Guava Benefits: మెరుగైన ఆరోగ్యం కోసం సీజనల్ ఫ్రూట్స్ చాలా ఉపయోగకరం. ఇవి రుచిలోనే కాకుండా ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు అందిస్తాయి. సీజనల్ ఫ్రూట్‌లో అద్భుతమైంది, పెద్దఎత్తున పోషకాలున్నది జామ. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, లైకోపీన్, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ పెద్దఎత్తున ఉంటాయి. 
 

1 /5

వ్యాధుల్నించి రక్షణ జాంకాయలో నారింజను మించి విటమిన్ సి ఉంటుంది. ఫలితంగా ఇమ్యూనిటీ శరవేగంగా పెరుగుతుది.ఇది బ్యాక్టీరియా, వైరస్ నుంచి రక్షించుకునేందుకు పనిచేస్తుంది. జలుబు, దగ్గు వంటి సీజనల్ సమస్యల్నించి కాపాడుతుంది

2 /5

బరువు నియంత్రణ బరువు తగ్గించే ప్రక్రియలో జాంకాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉండి ఫైబర్ పెద్దఎత్తున ఉంటుంది. ఫలితంగా కడుపు త్వరగా నిండినట్టుండి క్రేవింగ్ తగ్గిస్తుంది. దాంతో బరువు నియంత్రణకు దోహదమౌతుంది.

3 /5

కేన్సర్ మప్పు  జామాకుల్లో కేన్సర్ నుంచి పోరాడే గుణాలుంటాయి. ట్యూమర్ వ్యాపించకుండా కాపాడుతుంది. జామాకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్ ముప్పును తగ్గిస్తాయి. 

4 /5

చర్మం కేశాల సంరక్షణ జామాకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పెద్దఎత్తున ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. చర్మం స్వెల్లింగ్ సమస్యను పోగొడతాయి. అంతేకాకుండా జామాకుల మిశ్రమం తలకు రాయడం వల్ల కేశాలు పటిష్టంగా ఉంటాయి.

5 /5

గుండె ఆరోగ్యం జాంకాయ రోజూ క్రమం తప్పకుండా తింటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా ట్రైగ్లిసరాయిడ్స్, కొలెస్ట్రాల్ కూడా తగ్గుతాయి.