Profitable Small Business Idea In Village: నెలకు లక్షల్లో ఆదాయం వచ్చే బిజినెస్‌.. తక్కువ టైంలో భారీ లాభాలు పొందవచ్చు..

Medical Shop Small Business Idea: వ్యాపారం చేయాలంటే తప్పనిసరిగా ఉన్నత చదువులు అవసరం అనేది పూర్తిగా తప్పుడు భావన. ఇప్పుడు చాలా మంది డిగ్రీలు లేకుండానే విజయవంతమైన వ్యాపారవేత్తలుగా మారుతున్నారు. చిన్న పల్లెటూరుల్లో కూడా వ్యాపారాలు చేయవచ్చు.  పెద్ద నగరాల్లో వ్యాపారం ప్రారంభించడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ ఊర్లు లేదా గ్రామాల్లో తక్కువ పెట్టుబడితోనే వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఊర్లు లేదా గ్రామాల్లో కొన్ని సేవలు లేదా ఉత్పత్తులు అందుబాటులో ఉండకపోవచ్చు. ఈ అవసరాన్ని గుర్తించి వ్యాపారాన్ని ప్రారంభించడం వల్ల త్వరగా విజయం సాధించవచ్చు. అయితే మీరు కూడా మీ గ్రామంలో లేదా ఊరిలో ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా? ఈరోజు మీరు తెలుసుకొనే బిజినెస్‌తో అధిక లాభాలను పొందవచ్చు. ఈ వ్యాపారం ఎలా ప్రారంభించాలి అనేది తెలుసుకోండి. 

1 /12

చిన్న పల్లెటూర్లలో వ్యాపారాలు చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. పెద్ద నగరాల్లో వ్యాపారం ప్రారంభించాలంటే భారీ పెట్టుబడి అవసరం అయితే పల్లెటూర్లలో తక్కువ పెట్టుబడితోనే మంచి వ్యాపారం చేయవచ్చు.  

2 /12

పెద్ద నగరాల్లో ప్రతి రకమైన వ్యాపారానికి ఎక్కువ పోటీ ఉంటుంది. కానీ పల్లెటూర్లలో పోటీ తక్కువగా ఉండటం వల్ల కొత్త వ్యాపారాలకు మంచి అవకాశాలు ఉంటాయి.  

3 /12

పల్లెటూర్లలో అద్దెలు, కూలీలు, ఇతర ఖర్చులు తక్కువగా ఉంటాయి. దీని వల్ల తక్కువ పెట్టుబడితోనే వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అంతేకాకుండా పల్లెటూర్లలో స్థానికంగా ఉత్పత్తి చేయబడిన వస్తువులకు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. 

4 /12

ఈ డిమాండ్‌ను తీర్చడానికి స్థానిక వ్యాపారాలను ప్రారంభించవచ్చు. దీని కోసం ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారాలు ప్రారంభించేవారికి అనేక రకాల ప్రోత్సాహకాలు అందిస్తుంది.

5 /12

 మీరు కూడా వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా? ఈరోజు మీరు తెలుసుకొనే బిజినెస్‌  మెడికల్‌ షాప్‌ వ్యాపారం. పల్లెటూర్లలో మెడికల్ షాప్ వ్యాపారం ఎంతో ముఖ్యమైనది.   

6 /12

పట్టణాల్లో లాగా పెద్ద హాస్పిటల్స్ లేకపోవడం, ప్రజలు చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు కూడా దూరపు ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండటం వల్ల మెడికల్ షాప్‌లు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయి.  

7 /12

పల్లెటూర్లలోని ప్రజలు చాలా వరకు వ్యవసాయ పనులు చేస్తారు. ఈ క్రమంలో వారికి చిన్న చిన్న గాయాలు, అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. హాస్పిటల్స్ పట్టణాల నుంచి దూరంగా ఉండటం వల్ల ప్రజలు అత్యవసరంగా మందులు అవసరమైనప్పుడు పట్టణాలకు వెళ్లలేరు.   

8 /12

పల్లెటూర్లలో జనాభా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మందుల అవసరం ఎల్లప్పుడూ ఉంటుంది. పల్లెటూర్లలో పరిమితమైన వైద్య సౌకర్యాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి మెడికల్ షాప్‌లు ప్రజలకు మొదటి చికిత్స అందిస్తాయి.  

9 /12

మెడికల్ షాప్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మెడికల్ షాప్‌ను ప్రారంభించడానికి అనేక రకాల లైసెన్స్‌లు అవసరం. ఫార్మసీ లైసెన్స్ అప్లికేషన్,  డ్రగ్ లైసెన్స్ ఫీజు లేదా చలాన్ ఇన్‌వాయిస్‌లు తప్పుకుండా తీసుకోవాలి.   

10 /12

మందుల గురించి తెలిసిన వ్యక్తిని స్టాఫ్‌గా నియమించుకోవాలి. ప్రజలకు మీ మెడికల్ షాప్ గురించి తెలియజేయడానికి మార్కెటింగ్ చేయాలి. 

11 /12

మెడికల్‌ షాప్‌ బిజినెస్‌తో మీరు నెలకు రూ. 50 వేలు సంపాదించవచ్చు.సంవత్సరానికి రూ. 6 లక్షలు ఆదాయం వస్తుంది. ఈ వ్యాపారం ప్రారంభించడానికి రూ. 2 లక్షలు పెట్టుకోవాల్సి ఉంటుంది.   

12 /12

పల్లెటూర్లలో మెడికల్ షాప్ వ్యాపారం ఎంతో అవసరం, లాభదాయకం. అయితే ఈ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు అన్ని అంశాలను పరిశీలించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి.