Jio New Recharge plans: చాలా కాలంగా దేశంలోని ప్రైవేట్ టెలీకం కంపెనీలు వినియోగదారులకు అవసరం ఉన్నా లేకపోయినా డేటా పేరుతో భారీగా డబ్పులు వసూలు చేస్తూ వచ్చాయి. అయితే ట్రాయ్ ఆదేశాల మేరకు ఇప్పుడీ కంపెనీలు కొత్త ప్లాన్స్ ప్రకటించాయి. కేవలం వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ అందించే రెండు ప్లాన్స్‌ను రిలయన్స్ జియో ప్రకటించింది.
అన్ని టెలీకం కంపెనీలు డేటా అవసరం లేనివారికై కేవలం వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ రీఛార్జ్ ప్లాన్స్ అందించాలని ట్రాయ్ ఆదేశించింది. ఇప్పటివరకూ ఉన్న వివిధ కంపెనీల ప్లాన్స్ ప్రకారం డేటా అవసరం ఉన్నా లేకపోయినా భారీగా ఖర్చు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ట్రాయ్ ఆదేశాలతో రిలయన్స్ జియో , ఎయిర్టెల్ కంపెనీలు కేవలం వాయిస్ కాలింగ్ ప్లాన్స్ ప్రవేశపెట్టాల్సి వచ్చింది. ఇందులో భాగంగానే రిలయన్స్ జియో రెండు కొత్త ప్లాన్స్ ప్రవేశపెట్టింది. వీటిలో ఒకటి 458 రూపాయల ప్రీ పెయిడ్ ప్లాన్ కాగా రెండవది 1958 రూపాయ ప్లాన్. ఈ రెండు ప్లాన్స్‌లో కేవలం వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ మాత్రమే ఉంటాయి. డేటా ఉండదు. డేటాతో అవసరం లేనివారికి లేదా ఇంట్లో బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ ఉండి వైఫై సదుపాయం ఉన్నవారికి ఈ ప్లాన్స్ ఉపయోగకరం.
జియో 458 రూపాయల ప్లాన్
ఇది జియో ఎంట్రీ లెవెల్ వాయిస్ ప్లాన్, ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు ఉంటుంది. అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌తో పాటు మొత్తం 1000 ఎస్ఎంఎస్లు ఉంటాయి. వీటితో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాప్స్ ఉచితంగా అందుతాయి.
జియో 1958 రూపాయల ప్లాన్
ఈ ప్లాన్ ఏడాది వ్యాలిడిటీతో అంటే 365 రోజులు పనిచేస్తుంది. ఈ ప్లాన్‌లో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 3600 ఎస్ఎంఎస్లు పొందవచ్చు. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ ప్రయోజనాలు ఉచితంగా అందుతాయి.
Also read: Railway Jobs: రైల్వేలో భారీగా ఉద్యోగాలు, పదో తరగతి పాస్ అయితే చాలు, ఎలా అప్లై చేయాలంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి