Maruti Dzire 2025 Model: పెద్ద సన్‌రూఫ్‌తో Dzire కొత్త మోడల్‌ 2025.. రూ. 6.79 లక్షల నుంచే ప్రారంభం.. ఫుల్‌ డిటెయిల్స్‌ ఇవే!

Maruti Suzuki Dzire Modal 2025: భారత మార్కెట్‌లోకి మారుతి సుజుకి Dzire కొత్త మోడల్‌ విడుదల కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో లాంచ్‌ కానుంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

  • Jan 23, 2025, 10:19 AM IST

Maruti Suzuki Dzire Modal 2025: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి గుడ్‌ న్యూస్‌ తెలిపింది. ఆటో ఎక్స్‌పో 2025లో భాగంగా అద్భుతమైన కొత్త ఎడిషన్‌ కారును పరిచయం చేసింది. ఈ కారు ప్రీమియం ఫీచర్స్‌తో పాటు అద్భుతమైన లుక్‌లో కనిపించబోతోంది. అలాగే ప్రత్యేకమైన కలర్‌ ఆప్షన్స్‌ను కూడా కలిగి ఉండబోతోంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలేంటో? ఇంతకీ ఈ కారేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
 

1 /6

ప్రస్తుత డిజైర్ మోడల్‌కి మార్కెట్‌లో అద్భుతమైన డిమాండ్‌ ఉంది. ఇది అత్యంత తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఆటో ఎక్స్‌పో 2025లో ఈ డిజైర్ కారుకు అప్డేట్‌ వేరియంట్‌, కొత్త ఎడిషన్ అందుబాటులోకి తీసుకువచ్చింది.       

2 /6

ఈ మారుతి సుజుకి డిజైర్ 2025 కారు చూడడానికి చాలా ప్రీమియం లుక్‌లో కనిపించబోతోంది. ఈ  అర్బన్ లక్స్ ఎడిషన్ బాడీ చాలా విభిన్నంగా ఉంటుంది. అంతేకాకుండా ఫ్రంట్ గ్రిల్, నోస్, డోర్ ప్యానెల్‌ను ఈ ఎడిషన్‌లో చాలా వరకు మార్చినట్లు తెలుస్తోంది.  అలాగే ఈ కారులో స్టైలిష్ క్రోమ్ యాక్సెంట్స్‌ కూడా లభించనున్నాయి.     

3 /6

మారుతి సుజుకి డిజైర్ 2025 కారు 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా  యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌ డ్రైవింగ్‌ సిస్టమ్‌ను కూడా అందిస్తోంది. అలాగే ప్రత్యేకమైన  Android Autoతో పాటు Apple CarPlay సెటప్‌లను కూడా అందిస్తోంది.  

4 /6

ఇందులో ప్రత్యేకమైన వైర్‌లెస్ కనెక్టివిటీను కూడా మారుతి సుజుకి అందిస్తోంది. అలాగే మొట్టమొదటి సారిగా ఈ కారులో క్రూయిజ్ కంట్రోల్‌తో పాటు సింగిల్-పేన్ సన్‌రూఫ్‌ ఆప్షన్‌ కూడా అందిస్తోంది. ఈ కారు ఏడు వైబ్రెంట్ కలర్ ఆప్షన్స్‌ను కలిగి ఉండబోతోంది.   

5 /6

ఈ కారు మార్కెట్‌లోకి లాంచ్‌ అయితే ఇటీవలే విడుదలైన డిజైర్ హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరాతో పాటు టాటా టిగోర్ కార్లతో పోటీ పడనుంది. అలాగే ఇందులో శక్తివంతమైన  1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను కూడా అందిస్తోంది.  

6 /6

మారుతి సుజుకి డిజైర్ 2025 కారు ఇంజన్‌ 81.58 bhp గరిష్ట పవర్ అవుట్‌పుట్‌తో పాటు 111.7 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇక దీని ధర వివరాల్లోకి వెళితే.. ధర రూ. 6.79 లక్షల ఎక్స్-షోరూమ్ నుంచి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులోనే టాప్‌ వేరియంట్‌ రూ. 10.14 లక్షలు ఉండే అవకాశాలు ఉన్నట్లు సమాచారం..