Rashmika Mandanna: మహారాణి లుక్‌లో గత్తర రేపుతున్న రష్మిక మందన్న.. వైరల్‌గా మారిన చావా మూవీ పోస్టర్..

Chhaava Movie Poster: రష్మిక మందన్న చావా మూవీలోని మహారాణి లుక్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. ఈ మూవీపై ఇప్పటికే ఒక రేంజ్ లో హైప్ క్రియేట్ అయ్యింది. తాజాగా.. రష్మిక ఇన్ స్టా పోస్ట్ వైరల్ గా మారింది.

1 /6

నేషనల్ క్రష్ రష్మిక మందన్న,  విక్కికౌశాల్ లు జంటగా..  ఛావాలో నటిస్తున్నారు. ఈ మూవీకి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. విక్కీ కౌశల్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న ఈ మూవీలో.. రష్మిక మందన్న ఛత్రపతి శివాజీ సతీమణి మహారాణి ఏసుబాయిగా కన్పించున్నారు.   

2 /6

తాజాగా.. ఈ లుక్ ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ లుక్ పై.. రష్మిక మందన్న ఇన్ స్టాలో పోస్ట్ చేసి.. ప్రతి గొప్ప రాజు వెనుకాల.. యోధురాలైన భార్య ఉంటుందని కామెంట్ జతచేశారు. ఈ లుక్ చూసిన నేషనల్ క్రష్ అభిమానులు ఫిదా అయిపోతున్నారు.భారత దేశ చరిత్రలో ఛత్రపతి శివాజీ తెలియనివారంటు ఉండరని చెప్పుకొవచ్చు.   

3 /6

అలాంటి యోధుడి కుమారుడు సంభాజీ మహారాజ్. ఆయన చరిత్రలో తండ్రి తగ్గ గొప్ప బిడ్డగా పేరు, ప్రఖ్యాదులు సంపాదించుకున్నారు. హిందూ ధర్మంకోసం ఎన్నోపోరాటాలు సైతం చేశారు.. అలాంటి గొప్ప రాజు.. సంభాజీ జీవిత చరిత్ర గురించి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో చిత్రం రాబోతుంది. చావా మూవీలో.. శంబాజీ మహారాజ్ పాత్రను విక్కి కౌశాల్ నటిస్తుంగా.. ఆయన సతీమణి ఏసుభాయ్ పాత్రలో.. రష్మిక మందన్న నటిస్తున్నారు. మూవీమేకర్స్ తాజాగా.. ఏసుబాయ్ గా ఉన్న రష్మిక లుక్ ను విడుదల చేశారు.

4 /6

ఈ మూవీలో ఏసుబాయ్ పాత్రను చాలా పవర్ ఫుల్ గా చూపించారని టాక్ నడుస్తొంది. ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అదే విధంగా టీజర్ ను మూవీ మూకర్స్.. జన్వరి 22న ఈమూవీ ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.  

5 /6

ఈ లుక్ లో రష్మిక మందన్న అప్పటి కాలంలో రాణుల్లా కాస్ట్యూమ్స్ వేసుకుని అందంగా కన్పిస్తున్నారు. ఇప్పటి వరకు సింపుల్ గా... నవ్వుతూ అల్లరి పిల్లలా కన్పించిన రష్మిక.. ఈ లుక్ లో.. ఒక గొప్ప ఠీవీ ఆమెలో కన్పిస్తుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

6 /6

ఇది వరకు ఎప్పుడు చూడని ఒక లుక్ , ప్రత్యేకమైన పాత్రలో రష్మిక కన్పించనున్నారని మూవీ మేకర్స్ వెల్లడించారు.ఈ కథ మరాఠిలో సాగనుంది.  రష్మిక ఇందుకోసం మరాఠి భాష నేర్చుకున్నారు. దీనికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రేపు విడుదలయ్యే ట్రైలర్ కోసం అభిమానులు ఫుల్ క్రేజీగా ఎదురు చూస్తున్నారు.