Cough Remedies: దగ్గు అదేపనిగా వేధిస్తోందా, ఈ 5 ఆయుర్వేద చిట్కాలు ట్రై చేయండి

చలికాలం వచ్చిందంటే చాలు వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా దగ్గు, గొంతులో గరగర వంటి సమస్యలు ఎదురౌతుంటాయి. ఒక్కోసారి దగ్గు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా వదలదు. అయితే కొన్ని ఆయుర్వేద చిట్కాలతో ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Cough Remedies: చలికాలం వచ్చిందంటే చాలు వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా దగ్గు, గొంతులో గరగర వంటి సమస్యలు ఎదురౌతుంటాయి. ఒక్కోసారి దగ్గు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా వదలదు. అయితే కొన్ని ఆయుర్వేద చిట్కాలతో ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
 

1 /5

కరక్కాయ దగ్గు తరచూ వేధిస్తూ, ఎన్నిమందులు వాడినా తగ్గకుంటే కరక్కాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. చలికాలంలో కరక్కాయ అద్భుత ప్రయోజనకారి. 

2 /5

పిప్పలి పిప్పలిని పొడుగు నల్ల మిరియాలంటారు. ఇి కేవలం ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా భయంకరమైన దగ్గు తగ్గించేందుకు దోహదపడుతుంది. దగ్గు సమస్యను తగ్గిస్తుంది.  గొంతు గరగర, దగ్గును తగ్గిస్తుంది

3 /5

అల్లం అల్లం అనేది వంటల్లో రుచి పెంచేందుకు ఉపయోగపడుతుంది. చలికాలంలో ప్రత్యేకించి దగ్గు సమస్యల్ని తగ్గించేందుకు దోహదపడుతుంది. తరచూ దగ్గు సమస్య ఉంటే అల్లం నమిలి తింటే ఉపయోగపడుతుంది.

4 /5

పసుపు పసుపులో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చాలా ఎక్కువ. అదే పనిగా దగ్గు వేధిస్తుంటే అద్భుతంగా పనిచేస్తుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. వేడిపాలలో పసుపు, తులసి ఆకుల పౌడర్ కలుపుకుని తాగితే అద్భుతంగా పనిచేస్తుంది.

5 /5

తులసి తులసి ఆకులు చలికాలంలో దగ్గు, జలుబు సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది. తులసి ఆకుల్లో యాంటీ మైక్రోబియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రెస్పిరేటరీ  ఇన్‌ఫెక్షన్ తగ్గించేందుకు దోహదం చేస్తుంది. ప్రత్యేకించి దగ్గు సమస్య తగ్గుతుంది. తులసి ఆకులతో హెర్బల్ టీ చేసుకుని తాగాలి.