Venkatesh: వెంకటేష్ కి భార్య అంటే మరి ఇంత పిచ్చి ప్రేమనా..?

Venkatesh daughter: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్, తన కుటుంబం పై ఎంత ప్రేమ వలకబోస్తారో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనకు తన భార్య అంటే ఎంత ఇష్టమో తన మాటల్లో చెప్పుకొచ్చింది పెద్ద కూతురు ఆశ్రిత. 

1 /5

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్, నీరజారెడ్డి నీ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. భార్యే ప్రపంచంగా ఆయన బ్రతుకుతూ ఉంటారన్న విషయం అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా వీరికి నలుగురు పిల్లలు.. ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. అయినా సరే తన పిల్లల కంటే తన భార్యనే ప్రేమగా చూసుకుంటారు వెంకటేష్. 

2 /5

ఇక ఈ విషయాన్ని ఆయన పెద్ద కూతురు ఆశ్రిత స్వయంగా చెప్పడంతో ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తాజాగా హీరో వెంకటేష్ నటించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జనవరి 14వ తేదీన విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రానా షో కి డైరెక్టర్ అనిల్ రావిపూడి తో మొత్తం హీరోయిన్స్ ఐశ్వర్య, మీనాక్షి చౌదరి హాజరయ్యారు.

3 /5

అంతేకాదు ఈ కార్యక్రమానికి వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత కూడా హాజరైంది. ఇక చిట్ చాట్ లో భాగంగా ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. మీ నాన్నకి నలుగురు పిల్లలు కదా.. వెంకటేష్ గారికి మీ నలుగురిలో ఎవరంటే ఇష్టం అని అడగగా.. ఆశ్రిత మాట్లాడుతూ.." మా నాన్నకి మా అమ్మ అంటేనే ఇష్టం అంటూ తెలిపారు. ఆ ఇష్టం ఎంతలా అంటే.. నీరూ ఎక్కడికి వెళ్ళింది అంటే పాపం పడుకుంది అని చెబుతాడు.”

4 /5

“ఇంతవరకు ఓకే కానీ డిన్నర్ చేద్దామని నీరూ ఏం చేస్తోంది  అంటే పాపం బయటకెళ్ళింది అంటాడు.. ఇక నీరూ ఎక్కడికి వెళ్ళింది అంటే పాపం షాపింగ్ కి వెళ్ళింది అంటాడు.. ఇందులో పాపమనడానికి ఏముంది.. దీన్ని బట్టి చూస్తే మా నాన్నకి మా అమ్మ అంటే ఎంత ఇష్టమో మీరే అర్థం చేసుకోవచ్చు,” అంటూ తెలిపింది ఆశ్రిత.   

5 /5

వెంకటేష్ తన భార్య అంటే ఎంత ఇష్టమో.. అన్ స్టాపబుల్ షోలో చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తనకు సినిమా షూటింగ్ ల నుండి గ్యాప్ దొరికితే తన భార్యతో ముచ్చట్లు పెట్టుకొని, తన భార్యకు వంట గదిలో సహాయం చేస్తానని తెలిపారు.