Kateri Halwa: సంక్రాంతి స్పెషల్.. అందరు తప్పకుండా తినే కాటేరీ హల్వా ఇలా ఈజీగా చేసుకొవచ్చు..

Kateri halwa Recipe: సంక్రాంతి పండగకు చాలామంది రకరకాల స్నాక్స్ చేసుకుంటారు. దీనిలో ముఖ్యంగా నువ్వులు, బెల్లం లడ్డులు, చకినాలు తప్పకుండా చేసుకుంటారు. దీనితో పాటు... కాటేరీ హల్వానుకూడా  చాలా మంది ఇష్టంతో  చేసుకుంటారు.
 

1 /6

సంక్రాంతి పండుగను అందరు ఎంతో గ్రాండ్ గా చేసుకుంటారు. ఈ వేడుక కోసం చదువులు, ఉద్యోగాల కోసం ఎక్కడున్న కూడా.. తమ సొంతూర్లకు వెళ్తుంటారు. ఈ క్రమంలో సొంతూర్లలో ప్రస్తుతం ఒక రకమైన సందడి వాతావరణం కన్పిస్తుంది.  

2 /6

సంక్రాంతిని మూడు రోజుల పాటు జరుపుకుంటారు. భోగీ, సంక్రాంతి, కనుమలుగా జరుపుకుంటారు. ఈ వేడుకల కోసం చాలా మంది పిండి వంటలు చేసుకుంటారు. మరికొందరు నువ్వుల లడ్డులు కూడా చేసుకుంటారు. చకినాలు, అప్పాలు తప్పకుండా చేసుకుంటారు.   

3 /6

అయితే.. సంక్రాంతి వచ్చిందంటే.. చాలా మంది కాటేరీ హల్వాను ఇష్టంతో చేసుకుంటారు. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా.. కాటేరీ హల్వా కోసం.. చక్కెర, పాలు, నువ్వులు, బెల్లం, జిలేబీ రంగుల్ని రెడీగా పెట్టుకొవాలి.

4 /6

ముందుగా.. ఒక కడయ్ లో నీళ్లు పోసి.. గొరు వెచ్చగా వెడి అయ్యే వరకు చూడాలి. దానిలో చక్కెర వేయాలి. ఆ తర్వాత పాలు వేయాలి. అదంతా మిక్స్ అయిపోయే వరకు ఆగాలి. అది పాకంలాగా మారే వరకు చూడాలి. దానిలో.. రెండు నుంచి మూడు చెంచాల నువ్వులు వేయాలి.  

5 /6

ఆ తర్వాత కడయ్ ను పక్కకు తీసుకుని.. మరోక ప్లేట్ లో నువ్వులు తీసుకొవాలి. దాని మీద ఈ పాకంను వేయాలి.. ఆ తర్వాత చక్కగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ అయ్యాక.. ఒక రోజు అలానే ఉంచేయాలి. దీంతో అదంత ఆరిపోయి.. నువ్వులు ఉబ్బుతాయి.   

6 /6

మళ్లీ దానిలో పాకంను వేడి చూసి మరల నువ్వుల మీద వేయాలి.. ఆ తర్వాత అప్పటికే గిన్నెలో ఉన్న నువ్వుల్ని మిక్స్ చేయాలి. దీంతో మళ్లీ నువ్వులు పెద్దగా.. రౌండ్ గా సైజ్ లో పెద్దగా మారుతాయి. ఇలా చేశాక.. ఆ నువ్వుల మిక్సర్ లో.. జిలెబీ రంగును వేయాలి. మనకు కావాల్సిన రంగుల్ని ఆ నువ్వుల్లో వేసుకుంటే.. ఆ రంగుల్లో కాటేరీ హల్వా రెడీ అవుతుంది. ఇది రెండు రోజుల ప్రాసెస్ అన్నమాట. దీన్ని నువ్వుల లడ్డుతో కలిపి తింటుంటారు.