Bhogi festival: భోగీ పండుగ రోజున చాలా మంది తమ ఇళ్లలో చిన్న పిల్లలకు భోగీ పండ్లు పోస్తుంటారు. అయితే.. ఈ కార్యక్రమం చేసేటప్పుడు కొన్నినియమాలను పాటించాలని పండితులు చెబుతుంటారు.
తెలుగు నాట సంక్రాంతిని పెద్దపండుగ అని పిలుస్తుంటారు. ఈ పండుగను మూడు రోజుల పాటు నిర్వహించుకుంటారు. భోగీ, మకర సంక్రాంతి,కనుమలుగా జరుపుకుంటారు. అయితే.. ఇప్పటికే ఎక్కడ చూసిన పండుగ శోభ కన్పిస్తుంది. గాలిపటాలు, ముగ్గుల రంగులు, పిండి వంటల అమ్మకాలతో దుకాణాలన్ని కిట కిటలాడుతున్నాయి. అయితే.. చాలా మంది తమ సొంతూర్లకు వెళ్లిపోతున్నారు. ఈక్రమంలో బస్సులు, ట్రైన్ లు అన్ని కూడా ఫుల్ రష్ గా కన్పిస్తున్నాయి.
ఈ సారి.. 13,14,15 లలో భోగీ, సంక్రాంతి, కనుమలను జరుపుకోబుతున్నాం.అయితే.. మొదటి రోజు భోగి రోజున చాలా మంది తమ ఇళ్లలో చిన్నపిల్లలకు భోగీ పళ్లు (రేగు పళ్ల)ను పోసే సంప్రదాయంను పాటిస్తుంటారు. ముఖ్యంగా దీని వెనుక సైంటిఫిక్ రీజన్తో పాటు.. పురాణాకథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి.
ముఖ్యంగా 12 లోపు పిల్లలకు రేగు పండ్లను పోసే సంప్రదాయం పాటిస్తుంటారు. రేగు పండ్లలో శ్రీమన్నారయణుడు ఉంటారంట. ఆయన ఈ చెట్టు కింద తపస్సు కూడా చేశారంట. ఈ రేగు పండ్లను బదరిక ఫలం అని కూడా పిలుస్తుంటారు. సూర్యుడికి కూడా ఈ ఫలం అంటే ఎంతో ప్రీతీకరమైందంట.
రేగు పండ్లు, బంతిపూలు, కాయిన్స్, చెరుకు గడ ముక్కలు, చాక్లెట్ లు, నానబెట్టిన సెనగలు, దేవతల అక్షింతలు మొదలైనవి ఒక గిన్నెలలో వేసి.. పిల్లలకు మొదట తిలకం దిద్ది.. చిన్న పిల్లల్ని ఒక చాప లేదా సంత్రంజీ మీద కింద కూర్చుండ బెట్టి.. ముత్తైదువలు పాటలు పాడుతూ.. రేగు పండ్లు ఉత్సవంను జరుపుకుంటారు.
అదే విధంగా తల మీద బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఈ రేగు పండ్లను తల మీద నుంచి వేయడం వల్ల అది యాక్టివేట్ అవుతుందని చెబుతుంటారు. ముఖ్యంగా ఈ కాలంలో రేగు పండ్లను తినడం వల్ల ఇమ్యునిటీ పెరుగుతుందని, జీర్ణ వ్యవస్థ సంబంధ సమస్యలు ఉండవని చెప్తుంటారు. దీనితో పాటు.. నరఘోష, దిష్ట సంబంధమైన ఎలాంటి దోషాలున్న కూడా.. ఈ రేగు పండ్లను పోస్తే.. అవన్ని పోతాయని చాలా మంది విశ్వసిస్తుంటారు.