Best Nutrients: చలికాలం వచ్చిందంటే చాలు వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. చలికాలంలో ఎక్కువగా కన్పించే సమస్య విటమిన్ డి లోపం. ఇది లోపించడం వల్ల మనిషి బలహీనమైపోతాడు. కీళ్ల నొప్పుులు, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలుంటాయి. ఎముకల్ని పటిష్టం చేస్తుంది. దీనికోసం 5 బెస్ట్ న్యూట్రియంట్లు డైట్‌లో చేర్చాల్సి ఉంటుంది.
మెగ్నీషియం మెగ్నీషియం అనేది కాల్షియంను ఎముకలకు జోడించే పని చేస్తుంది. కండరాలు, నాడీ వ్యవస్థకు చాలా ప్రయోజనకరం. ఎక్కువగా నట్స్, బాదం, వాల్‌నట్స్, తృణ ధాన్యాల్లో ఉంటుంది
విటమిన్ డి విటమిన్ డి ఎముకలకు చాలా బెస్ట్ న్యూట్రియంట్. శరీరంలో కాల్షియం సంగ్రహణలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. సూర్యకిరణాలు కాకుండా గుడ్లు, మష్రూం, ఫోర్టిఫైడ్ ధాన్యంలో కావల్సినంత విటమిన్ డి లభిస్తుంది
కాల్షియం కాల్షియం ఎముకలు, దంతాల్ని పటిష్టం చేస్తుంది. కండరాలు, నాడీ వ్యవస్థకు చాలా అవసరం. పాలు, పెరుగు, పన్నీర్, కాల్షియం బెస్ట్ సోర్స్. బాదం, ఆకు కూరలు, నువ్వులు అద్భుతంగా పనిచేస్తాయి.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి శరీరంలో స్వెల్లింగ్ సమస్యను తగ్గించి ఎముకల్ని బలోపేతం చేస్తాయి. ఇది ఎక్కువగా సాల్మన్, మ్యాకరల్ వంటి ఫ్యాటీ పిష్‌లోనూ, ఫ్లక్స్ సీడ్స్, వాల్‌నట్స్‌లోనూ ఉంటాయి.
విటమిన్ కే విటమిన్ కే ఎముకల మెటబోలిజంను సపోర్ట్ చేస్తుంది. ఎముకలు విరగకుండా కాపాడుతుంది. తోటకూర, పాలకూర, సోయాబీన్ వంటి పోషకాలు లభిస్తాయి.