Pawan kalyan hot comments on Tirumala stampede incident: తిరుమలలో ఇటీవల వైకుంఠ ఏకాదశి వేళ చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన దేశంలో మళ్లీ దుమారంగా మారింది. ఇటీవల తెలంగాణ పుష్ప2 మూవీ ప్రీమియర్ షో నేపథ్యంలో జరిగిన తొక్కిసలాట సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ప్రస్తుతం తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేళ టికెట్ల కోసం వచ్చిన భక్తులు ఒక్కసారిగా తొక్కిసలాట జరగడం వల్ల.. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో.. 40 మంది వరకు భక్తులు తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తొంది.
ముఖ్యంగా ఈ ఘటనకు టీటీడీ అధికారులు, పోలీసుల సిబ్బంది మధ్య సమన్వయంలోపంతోనే జరిగిందని చెప్పుకొవచ్చు.. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవర్ కళ్యాణ్ ఘటన స్థలాన్నిచూసి, బాధితుల్ని పరామర్శించారు. అదే విధంగా అధికారుల్ని ఏకీపారేశారు. ఈ క్రమంలో తిరుమల ఘటనపై పవన్ చాలా బాధకరమని చెబుతూ.. తిరుమలో భక్తులకు, బాధిత కుటుంబాలకు జరిగిన ఘటనపై.. ఏమాత్రం ఈగోలకు పోకుండా.. క్షమాపణ చెప్పారు.
తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ చెప్పాలి - పవన్ కళ్యాణ్
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, EO శ్యామల రావు, AEO వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యులు భక్తులకు క్షమాపణ చెప్పాలి
సారీ చెప్పడానికి నామోషీ ఎందుకు.. ఇలాంటి వారికి కాకపోతే ఇంకెవరికి చెప్తాం… pic.twitter.com/BRpriRpqoT
— Telugu Scribe (@TeluguScribe) January 10, 2025
ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా సైతం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. పవన్ కళ్యాణ్ ఈరోజు పిఠాపురం సందర్శించారు. పిఠాపురం మండలం కుమార పురంలో షెడ్లను ప్రారంభించారు. ముఖ్యంగా గత వైసీపీ హయాంలోఐదేళ్లలో.. 268 షెడ్లను నిర్మించగా.. తమ సర్కారు ఆరు నెలల్లోనే.. 12, 500 షెడ్లను నిర్మించిందని పవన్ కళ్యాణ్ చెప్పారు. దీని వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.
ఈ నేపథ్యంలో ఇటీవల చోటు చేసుకున్న పలు ఘటనలోపై మాట్లాడారు. 15 ఏళ్లుగా వైసీపీపై పోరాటం చేస్తున్నాన్నారు. ఏపీకి రాజధాని నిర్మించలేదని.. ఖజానాను ఖాళీ చేసి, ఏపీని అప్పుల పాలు చేశారన్నారు. కడప ఎంపీడీఓపై దాడి అమానుషమన్నారు. తన తండ్రి కానిస్టేబుల్ గా పనిచేశాడని.. ప్రజల పన్నుతో తన తండ్రి జీతం తీసుకున్నాడని.. ఆరుణం తీర్చుకుంటానని పవన్ అన్నారు.
Read more: Tirumala: తిరుమలలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు.. శ్రీవారికి ప్రత్యేక పూజలు..
గిరిజన గ్రామాలు రోడ్లు లేవని.. అవన్నినిర్మిస్తామన్నారు. పిఠాపురంలో 14 రోజులు బస చేస్తానంటూ క్లారిటీ ఇచ్చారు . అదే విధంగా.. 54 గ్రామాలు తిరుగుతానని.. జిల్లా పర్యటనలు చేస్తానని పవన్ అన్నారు.
అదే విధంగా ఇటీవల తిరుమలలో చోటు చేసుకున్న ఘటన చాలా భాధకరమని.. దీనిపై తిరుమల టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామల రావు,ట్రస్ట్ బోర్డు సభ్యులు వెంటనే తిరుపతి ఘటనపై బాధితులకు క్షమాపణ చెప్పాలన్నారు. అదే విధంగా ప్రతి బాధితుడి ఇంటికి వెళ్లి ఓదార్చాలన్నారు. దీనిలో ఏదో మోహమాట పడటానికి ఏంలేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter