Scam Alert: ఈ మధ్యకాలంలో అంతర్జాతీయ నెంబర్లతో కాల్స్ వస్తున్నాయి. ఎవరు చేశారో అని కంగారు పడవద్దు. తిరిగి కాల్ బ్యాక్ చేసే పొరపాటు అస్సలు చేయవద్దు. ఇవన్నీ స్కామ్ కాల్స్. అంతర్జాతీయంగా జరుగుతున్న వన్ రింగ్ కాల్ స్కామ్ ఇది. ఈ స్కామ్ జపాన్ నుంచి జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇదొక వన్ రింగ్ స్కామ్. అంటే రింగ్ ఇచ్చి కట్ చేస్తారు. మీరు తిరిగి కాల్ బ్యాక్ చేసేలా ప్రేరేపిస్తారు. మీరు వెనక్కి కాల్ చేశారా అంతే సంగతులు. వివిధ రకాల ఛార్జీలు పడిపోతాయి. లేదా మీ ఎక్కౌంట్ ఖాళీ కావచ్చు. వివిధ దేశాల్లో ఈ స్కామ్ చాలాకాలంగా జరుగుతోంది. ఇండియాలో ఈ మధ్యకాలంలో ఈ తరహా స్కామ్ కాల్స్ పెరుగుతున్నాయి. ముఖ్యంగహా పాపువా న్యూగినియా, స్లోవేనియా, కాంగో, బెల్జియం దేశాల నుంచి ఈ తరహా కాల్స్ ఎక్కువగా వచ్చినట్టు ట్రిపుల్ హ్యాక్ అనే వెబ్‌సైట్ గుర్తించింది. ఈ మధ్యకాలంలో ఫ్రాన్స్, యూకే నుంచి కూడా ఇలాంటి కాల్స్ వస్తున్నాయి. అంతర్జాతీయంగా వచ్చే ఈ కాల్స్‌లో ఒకటి రెండు కాల్స్ ఇచ్చి కట్ చేస్తారు. మీరు తిరిగి కాల్ చేసినప్పుడు ఇంటర్నేషనల్ హాట్‌లైన్‌కు కనెక్ట్ అవుతుంది. మిమ్మల్ని కనెక్ట్ చేసేందుకు డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తారు. ఫోన్ కాల్‌లో ఉంచి ప్రీమియం ఛార్జీలు పడేలా చేస్తారు. అందుకే ఇలాంటి నెంబర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ నెంబర్ల నుంచి వచ్చే కాల్స్‌కు స్పందించవద్దు.
స్కామ్ ఫోన్ నెంబర్లు దేశాలు
ముఖ్యంగా +1 కోడ్‌తో వచ్చే నెంబర్లను పొరపాటున కూడా లిఫ్ట్ చేయవద్దు. అంతేకాకుండా 232 సియోర్రా లియోన్, 242 బహామన్, 246 బార్బడోస్, 268 ఆంటిగ్వా, 284 బ్రిటీష్ వర్జిన్ ఐల్యాండ్స్, 345 కేమన్ ఐల్యాండ్స్, 441 బెర్ముడా, 473 గ్రెనడా, 649 కైకోస్, 664 మోంట్సెరాట్, 721 సింట్ మార్టెన్, 758 సెయింట్ లూసియా, 767 డొమినికా, 784 సెయింట్ విన్సెంట్, 809,829,849 డొమినికన్ రిపబ్లిక్, 868 ట్రినిడాడ్ అండ్ టొబాగో, 869 సెయింట్ కిల్స్ అండ్ నెవిస్, 876 జమైకా నుంచి వచ్చే కాల్స్ లిఫ్ట్ చేయవద్దని సైబర్ సెల్ సూచిస్తోంది. కేవలం బిల్లులో అదనపు ఛార్జీలు పడేలా చేయడంతో పాటు మీకు తెలియకుండా మీ ఎక్కౌంట్ ఖాళీ చేసే ప్రమాదం లేకపోలేదు. అందుకే మీకు తెలియని ఇంటర్నేషనల్ నెంబర్ల నుంచి కాల్స్ వస్తే స్పందించవద్దు.
Also read: SBI Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, ఎస్బీఐలో 14 వేల ఉద్యోగాల భర్తీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.