Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పూంచ్ జిల్లాలోని మెంధార్ సబ్ డివిజన్లోని బల్నోయ్ ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ వాహనం లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు మృతి చెందగా, 12 మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఒక సైనికుడు ఎలాంటి గాయలు లేకుండా బయటపడ్డాడు. వాహనంలో మొత్తం 18 మంది సైనికులు ఉన్నట్లు సమాచారం.
పూంచ్ జిల్లాలోని మెంధార్ సబ్ డివిజన్లోని మాన్‌కోట్ సెక్టార్‌లోని బల్నోయ్ ప్రాంతంలో భారత ఆర్మీ వాహనం 300 అడుగుల లోతైన లోయలో పడిపోవడంతో పెద్ద ప్రమాదం జరిగింది. సైనిక సిబ్బంది వాహనంలో తమ పోస్ట్ వైపు వెళుతుండగా, మార్గమధ్యంలో వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం సంభవించింది. వాహనంలో మొత్తం 18 మంది సైనికులు ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని చెప్పారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని, సహాయక, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ సంఘటన మాన్‌కోట్ పోలీస్ స్టేషన్ , మెంధార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నియంత్రణ రేఖ సమీపంలో జరిగింది.
Also Read: SEBI Chief: సెబీ చైర్పర్సన్ మాధాబి పూరీ బుచ్‌కు లోక్‌పాల్ నోటీసులు ..వచ్చేనెలాఖరులో విచారణకు రావాలని ఆదేశం
ఇలాంటి ప్రమాదమే నవంబర్ 4వ తేదీన కూడా చోటుచేసుకుంది. రాజౌరీ జిల్లాలోని బడాగ్ ప్రాంతంలో సైనిక వాహనం లోయల్ పడటంతో ఒకరు మరణించారు. మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. నవంబర్ 2వ తేదీన రేసి జిల్లాలో ఓ కారు లోయలోకి దూసుకెళ్లింది. మహిళతో సహా 10 నెలల బాలుడు మరణించాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook