paduri Srinivasa reddy sensational comments on allu arjun: పుష్ప2 సినిమా ప్రీమియర్ షో నేపథ్యంలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ ను ఏ 11 గా పోలీసులు చేర్చారు. అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ ను ఏకీపారేశారు. అయితే... మరల బన్నీ అదే రోజున మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ రేవంత్ సర్కారుకు కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తొంది.
ఈ క్రమంలో పోలీసులు అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చి తమ ఎదుట హజరు కావాలని ఆదేశించారు. బన్నీ.. ఈ రోజు చిక్కడ పల్లి పోలీసుల ఎదుట హజరయ్యారు. అదే విధంగా పోలీసులు బన్నీపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తొంది. మూడు గంటల విచారణ తర్వాత అల్లు అర్జున్ మరల తన ఇంటికి వెళ్లిపోయారు.
అల్లు అర్జున్‌కి రేవంత్ రెడ్డికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది
రేవంత్ రెడ్డి ఒక మాస్ లీడర్, సీఎం.. ఇతను తాత పేరు తండ్రి పేరు, మేనమామ పేరు పెట్టుకొని వచ్చినోడు - అడ్వకేట్ పోడూరి శ్రీనివాస్ రెడ్డి pic.twitter.com/1Aek9VKRtU
— Telugu Scribe (@TeluguScribe) December 24, 2024
ఈ నేపథ్యంలో విచారణ ముగిసిన తరువాత.. అడ్వకేట్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. అల్లు అర్జున్ ను కొంత మంది రాజకీయాపావుగా ఉపయోగించుకుంటున్నారని అన్నారు. పుష్ప సినిమాలో చేసినట్లుగా రేవంత్ రెడ్డి సర్కార్‌ను కుప్ప కూల్చాలని చూస్తున్నారని బాంబు పేల్చారు.
ఆయన వెనుక ఒక శక్తి ఉందని అన్నారు. రేపటి నుంచి వారంలో రేవంత్ సర్కారు కూల్చేందుకు ప్లాన్ లు చేశారని సంచలన ఆరోపనలు చేశారు. ఈ వారంలో బీఆర్ఎస్ లు, బీజేపీలు కూడా.. తమదైన స్టైల్ లో రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
అల్లు అరవింద్ ఫ్యామిలీని కాపాడటానికి అపోసిషన్ నేతలు మాట్లాడుతున్నారని, పక్క స్టేట్స్ నుంచి కూడా అల్లు అర్జున్ కు సపోర్ట్ చేస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు.. ఆయన బెయిల్ దొరికాక ప్రవర్తించిన విధానంను బట్టి ఆయన బెయిల్ రద్దు కావడం ఖాయమని.. రెండు మూడు రోజుల్లో ఆయన అరెస్ట్ కావడం ఖాయమన్నారు. ఇదిలా ఉండగా.. అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాంగా మాత్రమే కాకుండా.. సినిమా ఇండస్ట్రీలో కూడా కాకరేపుతున్నాయని చెప్పుకొవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.