Pushpa 2 movie Stampede controversy: పుష్ప2 మూవీ ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా గురించి నాన్ స్టాప్ గా రచ్చ నడుస్తొందని చెప్పుకొవచ్చు. తాజాగా,ఈ వివాదంలో నేషనల్ క్రష్ ను లాగినట్లు తెలుస్తొంది.
అల్లు అర్జున్ నటించిన పుష్ప2 సినిమా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనాలను క్రియేట్ చేస్తుంది. అదే విధంగా అనేక వివాదాలను కూడా మూటకట్టుకుంటుందని చెప్పుకొవచ్చు.
ఈ మూవీ నటుడు బన్నీ.. ప్రస్తుతం మధ్యంతర బెయిల్ మీద ఉన్న విషయం తెలిసిందే. తెలంగాణ ముఖ్య మంత్రి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ రావడం వల్లే ఈ ఘటన జరిగిందని షాకింగ్ కామెంట్స్ చేశారు.
అదే విధంగా అల్లు అర్జున్ థియేటర్ లో ఉండటం.. పోలీసులు బైటకు తీసుకొని వెళ్లడం వంటివి అనేక వీడియోలు నిన్న సోషల్ మీడియాలో రచ్చగా మారాయి. మొత్తానికి అల్లు అర్జున్ దే మిస్టేక్ అని సామాజిక మాధ్యమాలలో ప్రచారం కూడా జరిగింది.
ఓయూ జాక్ మాత్రం అల్లు అర్జున్ తీరును తప్పుబడుతున్నారు. ఆయన సీఎంను ఉద్దేశించి.. చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. రేవతి కుటుంబాన్ని కనీసం పరామర్శించకుండా.. అల్లు అర్జున్ డబ్బు మదంతో ఊగిపోయాడని ఓయూజాక్ ఆయన ఇంటి వద్ద నిరసన తెలిపారు.
ఈ నేపథ్యంలో ఓయూజాక్ మాట్లాడుతూ.. అల్లు అర్జున్ పై..ఆ రోజు సినిమాకు వెళ్లిన రశ్మిక మందన్న పై కూడా సీరియస్ అయ్యారు. అల్లు అర్జున్ ఇప్పటికైనా ఆ కుటుంబానికి రూ.25 కోట్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తొంది. అలా చేయలేని పక్షంలో 1500 మందితో వెళ్లి అల్లు అర్జున్ ఇంటిని చుట్టుముడతామని కూడా ఆయన హెచ్చరించారు.
రష్మిక మందన్ కూడా.. తన వంతు బాధ్యతగా బాధిత కుటుంబానికి రూ.15 లక్షలు పరిహారం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఇక దీంతో ఈ విషయం కాస్త వైరల్ గా మారుతోంది. దీంతో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు.. శ్రీవల్లి మెడకు చుట్టుకుందని తెలుస్తొంది.కొంత మంది సోషల్ మీడియాలో శ్రీవల్లికి సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం నష్టపరిహారం ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారంట.