Allu Arjun: అల్లు అర్జున్‌కు జైలు అధికారుల షాక్‌.. రాత్రంతా చంచల్‌గూడ జైలులోనే

Allu Arjun Still He Stay In Chanchalguda Prison: రోజంతా హైడ్రామా నడవగా మధ్యంతర బెయిల్‌ మంజూరైనా కూడా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ జైలులోనే ఉండనున్నారు. బెయిల్‌ పత్రాలు అందడంలో ఆలస్యం కావడంతో అల్లు అర్జున్‌ విధిలేక జైలులో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 13, 2024, 10:43 PM IST
Allu Arjun: అల్లు అర్జున్‌కు జైలు అధికారుల షాక్‌.. రాత్రంతా చంచల్‌గూడ జైలులోనే

Allu Arjun Jail: దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అరెస్ట్‌ వ్యవహారం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. రోజంతా సాగిన హైడ్రామా అర్ధరాత్రి వరకు కొనసాగింది. మధ్యంతర బెయిల్‌ మంజూరైనా కూడా చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్‌ విడుదల కాకపోవడం అల్లు కుటుంబసభ్యులు, అభిమానులను కలవరానికి గురి చేసింది. బెయిల్‌ పత్రాలు సరైన సమయానికి అందకపోవడంతో అర్జున్‌ విడుదల ఆలస్యమైందని తెలుస్తోంది. జైలు నుంచి తమ హీరో విడుదల కాకపోవడంతో అభిమానులు, మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

Also Read: Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట.. జైలుకు కాదు ఇంటికే! సంబరాల్లో ఫ్యాన్స్

 

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగి ఓ వివాహిత మృతి చెందిన కేసులో ఏ11గా ఉన్న అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో విచారణ అనంతరం రిమాండ్‌ విధించగా.. తెలంగాణ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌పై రెండు దఫాలుగా వాదనలు విన్న న్యాయస్థానం ఆఖరకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేశారు. బెయిల్‌ పేపర్లతో అల్లు అర్జున్‌ న్యాయవాదులు చంచల్‌గూడ జైలుకు చేరుకున్నారు. అయితే సమర్పించిన బెయిల్‌ పత్రాల్లో కొన్ని సక్రమంగా లేదని జైలు అధికారులు తెలిపారు.

Also Read: Allu Arjun: పోలీసుల అత్యుత్సాహం.. బెడ్రూమ్‌లోకి రావడంపై అల్లు అర్జున్ ఆగ్రహం

 

పత్రాల్లో లోపాలు
రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నా పత్రాలు సక్రమంగా లేకపోవడంతో జైలు అధికారులు అల్లు అర్జున్‌ విడుదల ఆలస్యమైంది. బెయిల్ ప్రక్రియ‌‌ పూర్తి కావడానికి చాలా సమయం పట్టడంతో జైలు నిబంధనల ప్రకారం రాత్రి 10 గంటల తర్వాత ఎవరినీ విడుదల చేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌ విడుదల ఆగిపోయింది. దీంతో అల్లు అర్జున్‌ శనివారం మాత్రమే జైలు నుంచి విడుదల కానున్నారు.

న్యాయవాదులు తీసుకువచ్చిన పత్రాల్లో తేడాలు ఉండడంతో జైలు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒరిజినల్‌ పత్రాలు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రక్రియ ఆలస్యం కావడంతో అల్లు అర్జున్‌ ఇక విధిలేక చంచల్‌గూడ జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఉంది. అల్లు అర్జున్‌ విడుదల కాకపోవడంతో అతడి కుటుంబసభ్యులు ఇంటికి వెనుదిరిగి వెళ్లిపోయారు. బన్నీ తండ్రి అల్లు అరవింద్‌ ఒక క్యాబ్‌ బుక్‌ చేసుకుని ఇంటికి వెళ్లిపోయారు. తమ హీరో జైలు నుంచి విడుదల కాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఇక శనివారం మధ్యాహ్నం బన్నీ విడుదలయ్యే అవకాశం ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News