Revanth Reddy: అల్లు అర్జున్ దేశం కోసం ఏం చేశారు? రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy Hot Comments On Allu Arjun Arrest: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అరెస్ట్‌ వ్యవహారంపై రేవంత్‌ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్‌ అరెస్ట్‌ను వెనకేసుకొస్తూనే.. దేశం కోసం ఏం చేశారని ప్రశ్నించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 13, 2024, 08:37 PM IST
Revanth Reddy: అల్లు అర్జున్ దేశం కోసం ఏం చేశారు? రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు

Allu Arjun vs Revanth Reddy: దేశవ్యాప్తంగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్‌ రెడ్డి మరోసారి రేవంత్ రెడ్డి అరెస్ట్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'ఆయన సినిమా తీశారు. ఇంటికి వెళ్లారు. వాళ్లు డబ్బులు పెట్టారు.. సంపాదించారు. అంతేకానీ దేశం కోసం ఏం చేశారు?' అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. కారుపై నిల్చొని హంగామా చేశారని అల్లు అర్జున్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట.. జైలుకు కాదు ఇంటికే! సంబరాల్లో ఫ్యాన్స్

 

న్యూఢిల్లీలో జరిగిన ఓ టీవీ డిబేట్‌లో రేవంత్‌ రెడ్డి పాల్గొని ప్రధానంగా అల్లు అర్జున్‌ కేసు అంశంపై మాట్లాడారు. 'భారతదేశంలో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్‌లు ఎందుకు అరెస్ట్ అయ్యారు. దేశంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉంది దానికి అనుగుణంగానే చట్టం పనిచేస్తుంది' అని స్పష్టం చేశారు. 'అల్లు అర్జున్ అరెస్టు చేశాం అంటున్నారు. కానీ అక్కడ మహిళ చనిపోయింది.. ఆమె కొడుకు ఇంకా జీవన్మరణ సమస్యతో బాధపడుతున్నాడు. దీనిపై ఎవరూ మాట్లాడడం లేదు' అని తెలిపారు.

Also Read: Allu Arjun: పోలీసుల అత్యుత్సాహం.. బెడ్రూమ్‌లోకి రావడంపై అల్లు అర్జున్ ఆగ్రహం

'ఘటనపై క్రిమినల్ కేసు బుక్ అయింది. పది రోజుల తర్వాత పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. ప్రజల ప్రాణం పోయింది అయినా కేసు పెట్టొద్దా?' అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. 'ఫిలిం స్టార్లు, పొలిటికల్ స్టార్ల కోసం ప్రత్యేకంగా ఏముండదు. కారులో వచ్చి సినిమా చూసి వెళ్తే ఎటువంటి సమస్య ఉండకపోయేది. కానీ కారులోంచి బయటికి వచ్చి చేతులుపి హడావిడి చేశారు. దీంతో జనం పెద్ద ఎత్తున ఎగబడ్డారు నియంత్రణ కాలేదు' అని రేవంత్‌ రెడ్డి నిలదీశారు.

'అల్లు అర్జున్‌ను ఈ కేసులో ఏ11గా పోలీసులు పెట్టారు. అక్కడ మహిళ ప్రాణం పోయింది ఎవరు బాధ్యులు?' అని రేవంత్‌ రెడ్డి నిలదీశారు. 'హోం శాఖ నా వద్ద ఉంది. ఈ కేసుకు సంబంధించి రిపోర్ట్ నాకు తెలుసు' అని తెలిపారు. 'సినిమా కోసం పైసలు పెట్టారు. పైసలు సంపాదించారు. వాళ్లు ప్రత్యేకంగా దేశం కోసం చేసింది ఏం లేదు' అని కొట్టిపారేశారు. 'అల్లు అర్జున్ సినిమా చూడటానికి వచ్చి సినిమా చూసి వెళ్లిపొకుండా కారులో నుంచి బయటకు చూస్తూ హంగామా చేశాడు. నీ సినిమా నువ్వు స్టూడియోలో స్పెషల్ షో వేసుకొని చూడొచ్చు కదా. కావాలంటే ఇంట్లో హోమ్ థియేటర్‌లో చూడొచ్చు కదా' అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News