Mohan Babu Controversy: అసెంబ్లీ రైడీ, పొలిటికల్ రౌడీ, ఆ తర్వాత రౌడీ.. వరుసగా రౌడీ సినిమాల్లో టైటిల్ రోల్స్ పోషిండము. అంతేకాదు హీరోగా స్టార్ డమ్ రాకముందు చాలా సినిమాల్లో మోహన్ బాబు రౌడీ తరహా పాత్రల్లో నటించడం కాబోలు.. ఇపుడు నిజ జీవితంలోను రౌడీలా ప్రవర్తిస్తున్నారా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా తన చిన్న కుమారుడుతో పాటు మీడియాపై ఆయన వ్యవహరించిన తీరుతో మరోసారి మోహన్ బాబు తీరు చర్చనీయాంశంగా మారాయి.
Mohan Babu Controversy: ఫామ్ హౌస్ రౌడీ.. ఇది ఎవరో అనడం లేదు. మోహన్ బాబు తన కుమారుడితో పాటు మీడియా ప్రవర్తించిన తీరుతో ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆది నుంచి మోహన్ బాబు తీరు వివాదాస్పదం అని చెప్పాలి. అయితే సినిమాల్లో అన్న ఎన్టీఆర్ ప్రేరణతో అడుగుపెట్టి హీరోగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
క్రమశిక్షణకు మారు పేరుగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు మోహన్ బాబు.నటుడుగా క్రమశిక్షణగా ఉండాలనుకోవడంలో తప్పులేదు కానీ.. అది చాలా సార్లు మిస్ ఫైర్ అయిన సందర్బాలున్నాయి. అంతేకాదు మోహన్ బాబు హీరోగానే కాకుండా నిర్మాతగా పలు బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే కదా.
గతంలో ఈయన రజినీకాంత్ తో నిర్మించిన ‘పెదరాయడు’ సినిమాలో నటించిన పెద్ద లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ను షూటింగ్ కు కాస్త ఆలస్యంగా వచ్చిందనే కారణంతో చేయి చేసుకున్నట్టు అప్పట్లో కొన్ని పత్రికలు కథనాలు రాసాయి కూడా. తన కంటే పెద్ద ఆర్టిస్ట్ అనే గౌరవం లేకుండా మోహన్ బాబు దురుసుగా ప్రవర్తించిన సందర్భాలను సీనియర్ జర్నిలిస్టులు గుర్తు చేస్తున్నారు.
ఆ తర్వాత మంచు విష్ణు ఫస్ట్ మూవీ ‘విష్ణు’ సినిమాలో కథానాయికగా నటించిన ఆమె పై కూడా మోహన్ బాబు తన చేతివాటం చూపించినట్టు సమాచారం. ఇలా ఒకటా రెండా తన నిర్మాణంలో తెరకెక్కిన చాలా చిత్రాల్లో నటించిన హీరోయిన్స్ కు, నటీనటులకు తన విశ్వరూపం ఏంటో చూపించారు.
అయితే.. షూటింగ్ కు ఆలస్యంగా రావడం వల్ల మిగతా నటీనటులకు సంబంధించిన కాల్సీట్స్ కు ఇబ్బందులు అవుతాయి. అలా లేట్ వచ్చిన వాళ్లకు సుతి మెత్తగా ఒకటికి రెండు సార్లు చెప్పిన తర్వాత .. ఆయన కోప్పడటంలో తప్పులేదు. కానీ కొన్ని సార్లు ఈయన ప్రవర్తనతో మోహన్ బాబు నిర్మించే సినిమాల్లో నటించేందుకు చాలా మంది ఆర్టిస్టులు భయపడిన సందర్భాలున్నాయి.
ఇక మంచు విష్ణు హీరోగా నటించిన ‘దేనికైనా రెడీ’ సినిమాలో బ్రాహ్మణులకు కాస్త అభ్యంతర కరంగా చూపించడం పట్ల బ్రాహ్మాణ సంఘాలు మండిపడ్డాయి. ఈ సినిమా విషయమై మోహన్ బాబు పాటు సినిమా క్షమాపణలు చెప్పాలని కోరితే.. వారిని వారి ఇంటి ముందే కొట్టించారు. ఒక రకంగా ఆ వర్గం వారి శాపం మోహన్ బాబు కుటుంబానికి తగిలిందనే కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియా వేదికగా చేస్తున్నారు.
అంతేకాదు ఈయన పై కొన్ని ఆరోపణలున్నాయి. అప్పట్లో కొంత మంది రాజకీయ, సినీ ప్రముఖులకు ఈయన బినామీగా ఉండి వారి ఆస్తులను చేజిక్కించుకున్నట్టు కూడా ఈయన పై ఆరోపణలున్నాయి. మొత్తంగా మోహన్ బాబు తీరు గురించి చెప్పుకుంటూ పోతే కొండవీటి చాంతాడంత ఉంటుంది.ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.
తాజాగా హైదరాబాద్ లోని జల్ పల్లి ఫాంహౌజ్ లో మోహన్ బాబు మీడియా జర్నలిస్టులపై దాడి చేసారు. కవరేజికి వచ్చిన రిపోర్టర్ చేతిలోని మైకు లాక్కుని అతనిపై దాడికి పాల్పడ్డాయి. పైగా ఆ రిపోర్టర్ అయ్యప్ప మాలలో ఉన్నారు. కనీసం మాల వేసుకున్నాడనే సృహ లేకుండా సదురు జర్నలిస్టుపై దాడి చేయడాన్ని మీడియా సంఘాలతో పాటు రాజకీయ, ప్రజా సంఘాల నేతలు తప్పుపడుతున్నారు. దీంతో పాటు అయ్యప్ప స్వాములు కూడా మోహన్ బాబు తీరును ఖండిస్తున్నారు.