/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Karthika masam narikela deepam Tradition: కార్తీక మాసంను ఎంతో పుణ్యప్రదమైన మాసంగా చెప్పుకొవచ్చు. మనకు ఉన్న తెలుగు నెలలన్నింటిలో కూడా కార్తీకం అత్యంత పవిత్రమైనది.ఈ నెలలో చేసే సూర్యోదయంకు ముందు చేసే స్నానం,దీపారాధన, దానాలు, నదీ స్నానాలు, హోమం, జపాలన్ని కూడా మంచి ఫలితాలను ఇస్తాయని చెబుతుంటారు. అందుకే కార్తీకంలో చాలా మంది పెళ్లిళ్లు చేసుకుంటారు, కొత్త ఇళ్లను, వాహానాలను సైతం కొనుగోలు చేస్తుంటారు. అయితే.. చాలా మంది కార్తీకంలో నదీ స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని చెబుతుంటారు. అందుకే ఈ కాలంలో నదులే కాకుండా.. చిన్న చిన్న చెరువులు, సరస్సులు, కుంటలలో కూడా ఆ విష్ణుదేవుడు ఉంటారంట.

అందుకు కార్తీకంలో గంగా స్నానం వల్ల చాలా పుణ్యం వస్తుందని చెబుతుంటారు. అంతేకాకుండా.. కార్తీకంలో మనం గతంలో తెలిసి, తెలియక చేసిన పాపలన్ని దీపారాధన వల్ల అవన్ని తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ మాసంలో గుళ్లను శుభ్రం చేసుకొవాలి. ధ్వజంస్థంబానికి కొత్తగా జెండాను ఎగుర వేయాలి. దీపం మనలోని చీకటిని తొలగించి, వెలుగుల వైపుకు తీసుకొని వెళ్తుంది. అందుకే కార్తీకంలో మనం చేసుకునే పనులన్ని కూడా దీపంవెలిగించడంతో మొదలు పెడితే..అఖండ ఫలితాలను ఇస్తుంది.

అయితే.. కార్తీకంలో చాలా మంది ఉసిరికాయ మీద దీపారాధన చేస్తుంటారు. తులసీ చెట్టు నీడలో దీపాలు వెలిగిస్తుంటారు. తులసీ చెట్టు అమ్మవారి స్వరూపంగా భావిస్తారు. అయితే.. ఈ మాసంలో.. కొబ్బరి దీపం వెలిగించిన కూడా అది గొప్ప ఫలితాలను ఇస్తుందని చెబుతుంటారు. ముఖ్యంగా సూర్యొదయానికి ముందు దేవుడి ముందు.. కొబ్బరికాయ తీసుకుని దానిలో నెయ్యిపోసి, ఐదు వత్తులు ఉంచాలి.

Read more: Karthika Masam 2024: కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు ఎందుకు వెలిగిస్తారు..?.. దీని వెనుక ఉన్న ఈ అంతరార్థం మీకు తెలుసా..?

అలా ఉంచిన తర్వాత ఆ దీపంకు పసుపు, కుంకుమలు  పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత ఆ దీపంను దేవుడి ముందు బియ్యం పోసి..దాని మీద పసుపు, కుంకుమలు పెట్టి ఉంచాలి. ఇలా చేస్తే మాత్రం.. అనుకొని విధంగా అఖండ ధనయోగం కల్గుతుందని పండితులు చెబుతున్నారు. కొబ్బరియను పూర్ణఫలం అంటారు. ఈ దీపం వెలిగించి, దేవుళ్ల స్తోత్రాలు చదువుకొవాలి. ఇలా భక్తితో కార్యక్రమాలు చేస్తే తెలిసి, తెలియని పాపాలు హరించుకుని పోతాయి.  అంతే కాకుండా.. జాతక దోషాలు, ఆర్థిక సమస్యలు ఉన్న కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Section: 
English Title: 
karthika masam 2024 kobbari ghee deepam tradition history details pa
News Source: 
Home Title: 

Karthika masam 2024: కార్తీకంలో నారీకేళ దీపం ప్రాముఖ్యత?... ఈ సమయంలో వెలిగిస్తే కోటీశ్వరులవ్వడం పక్కా..
 

Karthika masam 2024: కార్తీకంలో నారీకేళ దీపం ప్రాముఖ్యత?... ఈ సమయంలో వెలిగిస్తే కోటీశ్వరులవ్వడం పక్కా..
Caption: 
karthikamasamdeepam(file)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

వేడుకగా ప్రారంభమైన కార్తీకం..

భక్తులతో కిట కిటలాడుతున్న ఆలయాలు
 

Mobile Title: 
Karthika masam 2024: కార్తీకంలో నారీకేళ దీపం ప్రాముఖ్యత?... ఈ సమయంలో వెలిగిస్తే..
Inamdar Paresh
Publish Later: 
No
Publish At: 
Tuesday, November 12, 2024 - 14:39
Created By: 
Indamar Paresh
Updated By: 
Indamar Paresh
Published By: 
Indamar Paresh
Request Count: 
13
Is Breaking News: 
No
Word Count: 
281